మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిహారిక కొణిదెల. బుల్లితెరపై యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టిన నిహారిక.. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. నటిగా తనదైన నటనతో మెప్పించి సినీక్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. గ్లామర్ షో చిత్రాలు కాకుండా కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నిహారిక.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తుంది. ఇటీవలే కమ్యునిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించింది. ఇదిలా ఉంటే.. మీకు తెలుసా.. నటిగా ఎంట్రీ ఇవ్వకముందు నిహారిక కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అవును.. అందులో ఒకటి అక్కినేని అందగాడు అఖిల్ జోడిగా నటించిందట. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది నిహారిక.
గతంలో నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను అఖిల్ కలిసి ఓ షార్ట్ ఫిలిం చేశామని.. ఆ చిత్రానికి డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ దర్శకత్వం వహించాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ షార్ట్ ఫిలింను రాజమౌళికి చూపిస్తే.. ఇది రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండు అని అన్నారని చెప్పుకొచ్చింది. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఏంటీ అనేది మాత్రం చెప్పలేదు. కేవలం అఖిల్ తో మాత్రమే కాకుండా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నారట. కానీ షార్ట్ ఫిల్మ్ కాకుండా చివరకు సాంగ్ అయ్యింది అని చెప్పుకొచ్చింది. గతంలో నిహారిక చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. నాగార్జున నటవారసుడిగా అఖిల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత వచ్చిన హాలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక చివరగా అఖిల్ ఏజెంట్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలాకాలంగా అఖిల్ సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం లుక్ పూర్తిగ మార్చేశాడు.
చివరిగా ఏజెంట్ అనే పెద్ద షాక్ ఇచ్చాడు ఈ అక్కినేని జూనియర్ అందగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లోకి రాకముందు అఖిల్ ఓ షార్ట్ ఫిలింలో నటించాడని చాలా మందికి తెలియదు. అవును అఖిల్ ఓ షార్ట్ ఫిలిం చేశాడు. అదికూడా మెగా హీరోయిన్‌తో ఆ హీరోయిన్ ఎవరో కాదు నిహారిక. అఖిల్, నిహారిక కలిసి ఓ షార్ట్ ఫిలిం చేశారు.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.