నిజానికి హారర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓవైపు వణుకుపుట్టించే సీన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి చిత్రాలను చూసేందుకు అడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక తెలుగులో హారర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు భాషలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలే కాదు.. ఇతర భాషలలో రిలీజ్ అయిన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే జనాలకు నచ్చినట్లుగా సరికొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ మూవీస్ తెరకెక్కించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు హారర్ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. కొరియన్ భాషలో థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ కాన్సెప్ట్‌లకు కొదవలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఆ కోవకు చెందినదే. కొరియన్ సినిమా.. కానీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదాపు గంటన్నర నిడివి ఉన్న ఈ హారర్ మూవీ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఆ సినిమా పేరు స్లీప్.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కొరియన్ భాషతోపాటు ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైఫ్ అండ్ హస్బండ్.. హ్యాపీ లైఫ్. ఇందులో భార్య ప్రెగ్నెంట్. దీంతో ఇద్దరు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే సంతోషంగా గడుపుతున్న జీవితాల్లో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమె భర్తకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. పడుకున్న తర్వాత అతడు ఏం చేస్తాడు.? ఎలా బిహేవ్ చేస్తాడు.? ఎంత భయంకరంగా మారిపోతాడో.? అనేది అసలు ఊహించలేము. పగలంతా బాగానే ఉండే తన భర్త రాత్రి అయ్యేసరికి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తాడు.? అతడికి ఏమైనా దెయ్యం పడుతుందా ? తన భర్తను కాపాడుకోవడానికి ఆమె చేసింది..? అనేది ఈ సినిమా.
ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కంటెంట్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను మాత్రం ఒంటరిగా చూడకండి. హారర్ జోనర్ వచ్చిన సినిమాల్లో కంటే.. ఈ మూవీ కొంచెం డిఫెరెంట్ అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా దెయ్యాలు అనేవి చూపించకుండా సినిమా మొత్తం కేవలం నిద్రలో నడిచే డిజార్డర్‌తో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మూవీలో ప్రతీ సీన్ హైలెట్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాంక్.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.