Oh My Friend Ganesh: ‘ఓ మై ఫ్రెండ్ గణేశా’ చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే షాకవుతారు.. హృదయాలు దొచేసే అందమైన యువరాణి..

|

Dec 28, 2023 | 10:27 AM

తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సినిమాల్లో బాల నటీనటులుగా అలరించినవారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అందులో ఆహ్సాస్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ అప్పట్లో సూపర్ హిట్ అయిన హిందీ సినిమా 'ఓ మై ఫ్రెండ్ గణేశా' చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఓ చిన్నారితో వినాయకుడు స్నేహం చేయడం.. అతడితో కలిసి స్కూల్‏కు వెళ్లడం.. నిత్యం అతడి వెన్నంటే ఉంటాడు. 2007లో డైరెక్టర్ రాజీవ్ రుయా దర్శకత్వం వహించిన ఈ సినిమా

Oh My Friend Ganesh: ఓ మై ఫ్రెండ్ గణేశా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే షాకవుతారు.. హృదయాలు దొచేసే అందమైన యువరాణి..
Oh My Friend Ganesha
Follow us on

వెండితెరపై అమాయకత్వం.. అద్భుతమైన నటన..అల్లరితో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్స్. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సినిమాల్లో బాల నటీనటులుగా అలరించినవారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అందులో ఆహ్సాస్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ అప్పట్లో సూపర్ హిట్ అయిన హిందీ సినిమా ‘ఓ మై ఫ్రెండ్ గణేశా’ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఓ చిన్నారితో వినాయకుడు స్నేహం చేయడం.. అతడితో కలిసి స్కూల్‏కు వెళ్లడం.. నిత్యం అతడి వెన్నంటే ఉంటాడు. 2007లో డైరెక్టర్ రాజీవ్ రుయా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఆశు జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

తన నిజమైన గణేశా రాకతో అతడి స్నేహంతో ఆశు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా కథాంశం అప్పుడు ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ సినిమాలో ఆశు పాత్రలో నటించిన చిన్నోడు పాన్ ఇండియా స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మీకు తెలుసా ఆశు పాత్రలో కనిపించిన చిన్నోడు అబ్బాయి కాదు అమ్మాయి. ప్రస్తుతం యూత్ హృదయాలు దొచేస్తోన్న అందమైన ముద్దుగుమ్మ. అవును.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది అహ్సాస్. సుస్మితా సేన్, రాజ్‌పాల్ యాదవ్ కలిసి నటించిన వాస్తు శాస్త్రం సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అహ్సాస్. 2004 హర్రర్ చిత్రంలో రోహన్ పాత్రను పోషించింది. సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, అహ్సాస్ నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు. వాస్తు శాస్త్రం తర్వాత, ఆమె కభీ అల్విదా నా కెహ్నా, ఫూంక్, కసమ్ సే, డెవోన్ కే దేవ్… మహదేవ్ చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించింది. 24 ఏళ్ల ఈ నటి కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయినా పట్టువదలకుండా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. వెండితెరపై పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలతోపాటు.. అనేక వెబ్ సిరీస్ లలో నటించి తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది అహ్సాస్. గర్ల్స్ హాస్టల్, హాస్టల్ డేజ్, కోటా ఫ్యాక్టరీ , మోడరన్ లవ్ ముంబై లో కనిపించింది. చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన మిస్ మ్యాచ్డ్ సీజన్ 2లో కనిపించింది అహ్సాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.