అప్పట్లో ఊపేసింది..! 90’s కిడ్స్ ఫెవరేట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?

బుల్లితెర పై వెలుగు వెలిగిన స్టార్‌ యాంకర్లు చాలామందే ఉన్నారు. సుమ, ఝాన్సీ, రష్మీ, అనసూయ, శ్రీముఖి, లాస్య, రవి, ప్రదీప్.. ఇలా చాలామంది యాంకరింగ్‌లో తమదైన ముద్ర వేసుకున్నారు. తమ ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.  ఇప్పుడు చాలా మంది యాంకర్స్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

అప్పట్లో ఊపేసింది..! 90s కిడ్స్ ఫెవరేట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?
Anchor

Updated on: Feb 13, 2026 | 11:27 AM

బుల్లితెరపై చాలా మంది యాంకర్స్ రాణిస్తున్నారు. తమ అందచందాలతో, ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నారు. తెలుగులో యాంకర్ అని చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు సుమ కనకాల. ఎప్పటి నుంచో యాంకర్ గా రాణిస్తుంది సుమ ఆమెతో పాటు ఝాన్సీ, రష్మీ, అనసూయ, శ్రీముఖి, లాస్య, రవి, ప్రదీప్.. ఇలా చాలా మంది మంచి గుర్తింపై తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త కొత్త యాంకర్స్ చాలా మంది కనిపించి సందడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ లో కనిపించిన వారు కూడా ఇప్పుడు యాంకర్స్ లుగా మారి సందడి చేస్తున్నారు. అయితే వీరిలా కాకపోయినా ఉన్నంతలో యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది ఓ ముద్దుగుమ్మ.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఒకప్పుడు చాలా మందికి ఆమె అభిమాన యాంకర్.. టీవీలో ఆమె రోజూ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న యాంకర్ ను గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు యాంకర్ జయతి. పేరు చెబితే చాలామందికి గుర్తుకురాకపోవచ్చు కానీ ఒకప్పుడు జెమినీ మ్యూజిక్ ఛానెల్‌లో టెలికాస్ట్‌ అయిన ‘వెన్నెల’ ప్రోగ్రాం యాంకర్‌ అంటే ఇట్టే గుర్తుకు వస్తుందామె.. 90s కిడ్స్ కు చాలా మందికి తెలిసిన యాంకర్ ఆమె. జెమినీ మ్యూజిక్ ఛానెల్‌ ఆదిత్య టీవీగా మారాక అందులో రాత్రి 10 గంటలకు ‘వెన్నెల షో’ ప్రారంభమయ్యేది.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఈ షోకు దాదాపు 10 ఏళ్ల పాటు యాంకర్‌గా వ్యవహరించింది జయతి. తన ముద్దు ముద్దు మాటలతో, అందం అభినయంతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే వెన్నెల తర్వాత మరే షోలోనూ యాంకరింగ్ చేయలేదు జయతి. అదే సమయంలో వెండితెరపైకి అడుగుపెట్టింది. 2018లో లచ్చి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిందీ అందాల యాంకరమ్మ. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ కనిపించలేదు జయతి. మద్యలో ఓ టీవీ షోలో సడెన్‌గా ప్రత్యక్షమైంది. ఇందులో ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. దీంతో యాంకర్ జయతి పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఆతర్వాత మళ్లీ సైలెంట్ అయ్యింది. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉందా అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే జయతి ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది ఆ చిన్నది. ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

Jayathi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి