Sayali Bhagat: అల్లరి నరేశ్‌ ‘బ్లేడ్‌ బాజ్జీ’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?

ఈ అమ్మడు తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే మాత్రమే నటించింది. అయితే హిందీలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇప్పుడీ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది.

Sayali Bhagat: అల్లరి నరేశ్‌ ‘బ్లేడ్‌ బాజ్జీ’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?
Actress Sayali Bhagat

Updated on: Jan 01, 2026 | 12:30 PM

ఒకటి, రెండు సినిమాలతో కెరీర్‌ను ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో నాసిక్ బ్యూటీ సయాలీ భగత్ కూడా ఒకరు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే యాక్ట్ చేసింది. అల్లరి నరేశ్‌ హీరోగా, దేవీ ప్రసాద్‌ దర్శకత్వంలో 2008లో విడుదలైన బ్లేడ్ బాబ్జీ సినిమాలో సయాలీ హీరోయిన్ గా నిలిచింది. ఈ సినిమాలో తన గ్లామర్‌ లుక్‌తో కట్టిపడేసిందీ అందాల తార. అలాగే కామెడీ సన్ని వేశాల్లో కూడా బాగా నటించింది. సినిమా కూడా సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో సయాలీ మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. చాలామంది లాగే ఈ అందాల తార కూడా ఒక్క తెలుగు సినిమాకే పరిమితమైంది. అయితే బాలీవుడ్‌లో మాత్రం పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ది ట్రైన్‌, గుడ్‌లక్‌, హల్లాబోల్‌, కిర్కిట్, పేయింగ్ గెస్ట్‌, ఘోస్ట్, దిస్‌ వీకెండ్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌, యారియాన్‌ తదితర హిందీ సినిమాలు సయాలీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

సినిమాల్లో ఉండగానే పెళ్లిపీటలెక్కింది సయాలీ భగత్. 2013లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నవనీత ప్రతాప్ సింగ్ యాదవ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. 2020 జూన్‌లో వీరికి ఇవాంకా సింగ్‌ అనే కూతురు పెట్టింది. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది సయాలీ. అదే సమయంలో బిజినెస్ వ్యవహారాలతో బిజీ బిజీగా మారింది. రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో బాగానే రాణిస్తోంది.

ఇవి కూడా చదవండి

రియల్ ఎస్టేట్ లో రాణిస్తూ..

కొన్ని రోజుల క్రితం సయాలీ భగత్ కు అరుదైన గౌరవం దక్కింది. మహిళా సాధికారతలో భాగంగా ఆమెకు
“వి ఉమెన్ శక్తి అవార్డ్స్ 2025” వేడుకలో ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుందీ అందాల తార. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిలో కొంచెం బొద్దుగా కనిపించినప్పటికీ ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది సయాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.