ఇప్పుడు దేశమంతా ఆదిపురుష్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మైథలాజికల్ మూవీలో సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. గతంలో మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో కలిసి దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ భామ.
బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఇప్పుడు ఆదిపురుష్ తో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ సినిమానుంచి కృతిసనన్ లుక్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఈ అమ్మడి పై ప్రశంసలు పురిపిస్తున్నారు. సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ చిన్నది.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విషయాల గురించి. వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. తాజాగా కృతి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృతి సనన్ తన తల్లి ఫోటోను షేర్ చేసింది. కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటోలో ఒకవైపు ఆమె సీతమ్మ పాత్రలో ఉన్న ఫోటోని, మరొకటి అచ్చం అదే గెటప్ లో తన తల్లి గీతా సనన్ పాత ఫోటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.