
ఇప్పుడు ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తుంది. ఎంతో మంది తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇతర భాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు తెలుగులో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా కన్నడ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు మన దగ్గర స్టార్ హీరోయిన్స్ అయ్యారు. తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది భామలు వచ్చారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన మన దగ్గర స్టార్ గా మారింది. చేసింది రెండు సినిమాలే కానీ స్టార్ డమ్ సొంతం చేసుకొని ఎంతో మంచి కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. చేసిన రెండు సినిమాల్లో ఒకటి డిజాస్టర్ కాగా ఓ సినిమా సంచలన విజయం సాధించింది. కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం లేదు. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 3 కోట్లు వసూల్ చేస్తుంది ఈ చిన్నది.
అలాగే ఆమె ఆస్తి పాస్తులు కూడా కోట్లల్లో ఉన్నాయి. అంతే కాదు ఇండస్ట్రీలో ఆమెను మించిన హాట్ బ్యూటీ లేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆమె.. అందంలో అప్సరస.. కానీ తెలుగులో చేసిన సినిమాలు మాత్రం రెండు సినిమాలే ఒకటి డిజాస్టర్, మరో సినిమా భారీ హిట్. ఆమె ఎవరో కాదు దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో లోఫర్ అనే సినిమాతో పరిచయం అయ్యింది.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడ వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలోనూ నటించింది ఈ చిన్నది. కల్కి సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే చివరిగా కంగువ సినిమాలోనూ మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి