రూ. 5 వేలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఇప్పుడు నాలుగు నిమిషాలకే రూ. 2 కోట్లు అందుకుంటుంది

సినిమా తారల డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.  ఇప్పుడు ఒకొక్కరు కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోయిన్స్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ కోట్లు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ డమ్ ను బట్టి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అందాల భామలు.

రూ. 5 వేలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఇప్పుడు నాలుగు నిమిషాలకే రూ. 2 కోట్లు అందుకుంటుంది
Actress

Updated on: Jun 01, 2025 | 9:18 PM

సినిమా తారల డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.  ఇప్పుడు ఒకొక్కరు కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోయిన్స్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ కోట్లు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ డమ్ ను బట్టి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అందాల భామలు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా.. చాలా మందిలానే ఈ చిన్నది కూడా ఇండస్ట్రీకి రాక ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పడరాని పాట్లు పడింది. మొత్తానికి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?   తన అందంతో దేశాన్నే ఊపేసింది ఆమె.

చూడచక్కని రూపంతో ఆకట్టుకునే ఆ భామ డాన్స్‌ల్లో తోపు ఎవరో గుర్తుపట్టారా.? స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఆ బ్యూటీ మన రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆడిపాడింది. ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా ఫతేహి. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

నోరా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా సవాళ్ళను ఎదుర్కొంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది ఈ బ్యూటీ. అలాగే సినీ స్టూడియోల చుట్టూ తిరిగింది. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చింది. కెనడా నుంచి చేతిలో రూ. 5వేలతో ఇండియాలో అడుగుపెట్టిందట నోరా. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిందట. కడుపు నింపుకోవడానికి ఒక్క గుడ్డు, ఒక్క బ్రేడ్ మాత్రమే తినేదట అప్పట్లో.. ఇప్పుడు ఆమె ఓ స్టార్.. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్. 5 నిమిషాల సాంగ్ కోసం రూ. రెండు కోట్లకు పైగా వసూల్ చేస్తుంది. అలాగే ఈ చిన్నదాని ఆస్తిపాస్తులు రూ. 50కోట్లకు పైనే ఉన్నాయట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.