
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు జయసుధ. హీరోయిన్ గా ఆణిముత్యాలాంటి సినిమాలను అందించారు. ఒకప్పటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన జయసుధ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా సినిమాల్లో నటించారు. హీరోలు , హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ జయసుధ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఎన్నో సినిమాలు సినిమాల్లో ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించారు. అయితే జయసుధ ఓ హీరోతో మాత్రం ఏకంగా 31 సినిమాల్లో నటించారు. ఆ హీరో ఎవరో తెలుసా.?
తెలుగు సినీ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి మరుపురాని జంటలలో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు. జయసుధ గారు ఒకరు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తెలుగు సినిమాకు వారు అందించిన అద్భుతమైన సేవలను ఈ కాంబినేషన్ సినిమాలు స్పష్టంగా చాటి చెబుతాయి. శోభన్ బాబు, జయసుధల అద్భుతమైన కెమిస్ట్రీతో మొత్తం 31 చిత్రాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు తెలియని ఆనందం వచ్చేది. ఈ ఇద్దరి కోసమే సినిమాలకు వెళ్లే ఆడియన్స్ ఎంతో మంచి ఉండేవారు.
ఇక శోభన్ బాబు, జయసుధ కలిసి సోగ్గాడు, రాజు వెడలే, మొనగాడు, రాజా, కాలాంతకులు, మల్లెపువ్వు, బంగారు చెల్లెలు, జీవిత నౌక, నాయుడు బావ, మంచి బాబాయ్, జూదగాడు, మండే గుండెలు, ఇల్లాలు, సంసారం సంతానం, కోరుకున్న మొగుడు, ఇల్లాలి కోరికలు, రాజ్ కుమార్, ఇద్దరు దొంగలు, దండయాత్ర, భార్యామణి, పుణ్యం కొద్దీ పురుషుడు, జగన్, దానవుడు, మహా సంగ్రామం, మాంగల్య బలం, జీవన రాగం, ధర్మపీఠం దద్దరిల్లింది, విజృంభణ, సోగ్గాడి కాపురం, జీవిత ఖైదీ, ఆస్తి మూరెడు ఆశ బారెడు వంటి విజయవంతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. వీరి కలయికలో వచ్చిన ఈ 31 సినిమాలు తెలుగు చలనచిత్ర రంగానికి విశేషమైన ఖ్యాతిని తీసుకొచ్చాయి. శోభన్ బాబు, జయసుధల నటన ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.
.