సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. సినిమా షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక హీరో హీరోయిన్స్ త్రొ బ్యాక్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫొటో ఎప్పటిదో.. పై ఫొటోలో ఉన్న హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పే పేరు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఆయనది. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. పై ఫోటో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ప్రారంభోత్సవం సమయంలోనిది. ఈ ఫోటోలు కృష్ణ కాకుండా మరో సెలబ్రెటీ కూడా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.?
ఆయన పేరు చెప్తే అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆయన మరెవరో కాదు. వేణు స్వామి. సెలబ్రెటీలకు ప్రత్యేక పూజలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎవరు ఎప్పుడు అనారోగ్యం పాలవుతారో.. ఎప్పుడు చనిపోతారో కూడా చెప్తారు ఈయన. రష్మిక, అషు రెడ్డి, నిధి అగర్వాల్ లాంటి వారు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.
వేణు స్వామి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సినిమా సెలబ్రెటీలకు పూజలు చేస్తున్నారు. సినిమా ఓపినింగ్స్ సమయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ కు కూడా పూజ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణకే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా కు కూడా షూటింగ్ సమయంలో వేణు స్వామి పూజలు చేశారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా పూజలు నిర్వహించారు వేణు స్వామి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..