సీరియల్‌లో విలన్ బయట మాత్రం బీభత్సం.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న క్రేజీ బ్యూటీ

సాధారణంగా హీరోయిన్లకు ధీటుగా సీరియల్ తారలకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అమ్మడు మాత్రం సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది. అదే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ సరైన అవకాశం రాకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు..

సీరియల్‌లో విలన్ బయట మాత్రం బీభత్సం.. కుర్రాళ్లను ఆగం చేస్తున్న క్రేజీ బ్యూటీ
Actress

Updated on: Jul 29, 2026 | 1:14 PM

సినిమాలతో సరిసమానంగా సీరియల్స్ కు కూడా క్రేజ్ ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు సీరియల్స్ అనేవి ఆడవాళ్లకు ఓ ఎమోషన్. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలో సీరియల్స్ మోగాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో సీరియల్స్ చూసేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఉదయం సాయంత్రం అని తేడా లేకుండా ఓటీటీల్లో సీరియల్స్ అందుబాటులో ఉండటంతో తెగ చూసేస్తున్నారు జనాలు. ఇక సీరియల్స్ లో నటించే నటులకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సినీ సెలబ్రెటీలకు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు సీరియల్ భామలు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ను మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అంతే కాదు  సీరియల్ లో హీరోయిన్స్ మాత్రమే కాదు.. అందమైన విలన్స్ కూడా ఉంటారు. పైన కనిపిస్తున్న నటినిగుర్తుపట్టరా.?

ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది. అదే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ అవకాశాలు రాక సీరియల్స్ లో సత్తా చాటుతుంది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. కానీ అందం, గ్లామర్ విషయంలో మాత్రం ఆమె నెట్టింట సెన్సేషన్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సీరియల్ బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతుంది. ఆమె పేరు గాయత్రి సింహాద్రి. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు కానీ.. జ్యోత్స్న అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ ఫేమ్ జ్యోత్న్స. ఈ సీరియల్లో నెగిటివ్ షెడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తుంది ఈ అమ్మడు. జ్యోత్న్స అందం.. నెగిటివ్ షేడ్స్ ఉన్న యాక్టింగ్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. సీరియల్లో విలన్ గా మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం క్రేజీ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. విజయవాడకు చెందిన ఈ అమ్మడు.. హీరోయిన్ కావాలనుకుని సినీరంగంలోకి అడుగుపెట్టింది. మ్యాడ్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us