Tollywood : ఐఐటీ ఖరగ్‏పూర్‏లో ఇంజనీరింగ్.. లక్షల జీతం.. కట్ చేస్తే సినిమాల్లో తోపు హీరో..

చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అబ్బాయి.. కానీ అతడి కలలు చాలా పెద్దవి.. తన లక్ష్యాలను సాధించాలనే ఉత్సాహంతో ఎన్నో మార్గాల్లో ప్రయత్నాలు చేశారు. భారతీయ సినీపరిశ్రమలో ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన తన జీవిత లక్ష్యాన్ని వదిలేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే.. ?

Tollywood : ఐఐటీ ఖరగ్‏పూర్‏లో ఇంజనీరింగ్.. లక్షల జీతం.. కట్ చేస్తే సినిమాల్లో తోపు హీరో..
Jitendra Kumar

Updated on: Jun 06, 2025 | 12:15 PM

భారతీయ సినిమాల్లో స్టార్స్ కావడానికి చాలా మంది తమ ఉద్యోగాలను వదిలేసిన సంగతి తెలిసిందే. ఇంజనీర్లు, ఆర్కిటెక్టులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ నటుడి గురించి మీకు తెలుసా.. ? ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు నేడు అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరు. ఇటీవల అతడు నటించిన ఓ వెబ్ సిరీస్ 3 సీజన్స్ ఓటీటీలో సంచలనం సృష్టించాయి. అతడు మరెవరో కాదు.. నటుడు జితెంద్ర కుమార్ అలియాస్ జీతు భయ్య.

రాజస్థాన్‌లోని ఖైర్తాల్ అనే చిన్న గ్రామంలో 1990 సెప్టెంబర్ 1న జన్మించిన జితేంద్ర కుమార్ చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. చిన్న వయసు నుంచే షారుఖ్ ఖాన్, నానా పటేకర్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలను ఆరాధించేవాడు. నటనపై అతనికి మక్కువ ఉన్నప్పటికీ, జితేంద్ర తండ్రి అతన్ని IIT ప్రవేశ పరీక్షకు ప్రీపేర్ కావాలని చెప్పాడు. ఐఐటీలో ఉత్తీర్ణుడై ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ పొందాడు. ఐఐటీలో చదువుతున్న సమయంలోనే అతను నాటక రంగం వైపు మొగ్గు చూపాడు. అతను ‘హిందీ టెక్నాలజీ డ్రామాటిక్ సొసైటీ’లో పాల్గొన్నాడు. అదే సమయంలో దర్శకుడు బిశ్వపతి సర్కార్ ను కలిసిన జితేంద్ర కుమార్.. సినిమా పై ఉన్న ఆసక్తిని తెలిపాడు.

జితేంద్ర తన తొలినాళ్లలో టీవీఎఫ్‌లో చేరినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నటనకు విరామం ఇచ్చి బెంగళూరులోని ఒక బహుళజాతి కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం పనిచేసిన జీతేంద్ర కుమార్ ఆ తర్వాత ఉద్యోగం వదిలి తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Loading...
Unable to load recommendations.
Follow Us