
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని విజయాలు అందుకున్నప్పటికీ.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎప్పటికైనా మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వచ్చిన ‘బింబిసార’ మూవీ ఆయన కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు.. ప్రేక్షకుల్లో ఆయనపై అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు జనవరి 12న విడుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ థాయ్ తో కలిసి నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన భార్య స్వాతి గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల భార్యలు సినిమా వేడుకల్లో కనిపించడం తప్ప పెద్దగా వార్తల్లో ఉండరు. కానీ స్వాతి మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కేవలం హీరో భార్య మాత్రమే కాదు.. మంచి విద్యావంతురాలు, వ్యాపారవేత్త కూడా.
కళ్యాణ్ రామ్, స్వాతిలది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి చూపుల సమయంలోనే స్వాతిని చూసి కళ్యాణ్ రామ్ ఇష్టపడ్డారని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ భార్య విషయానికొస్తే.. ఆమె ప్రొఫెషనల్‌గా డాక్టర్. అంతేకాదు, ఆమె తండ్రి కొసరాజు ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఫార్మా రంగంలో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన స్వాతి.. వివాహం తర్వాత కొంతకాలం కుటుంబ బాధ్యతలకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల పెంపకం కోసం తన వృత్తిపరమైన ప్రయాణానికి విరామం ఇచ్చారు.
అయితే ఆ తర్వాత ఆమె మరో రంగంలోకి అడుగుపెట్టారు. వీఎఫ్ఎక్స్ రంగంపై ఆసక్తితో సొంతంగా ఓ సంస్థను స్థాపించి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారు. సినిమాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లోనూ తన సంస్థ ద్వారా భాగస్వామ్యం అయ్యారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రానికి తక్కువ సమయంలోనే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడంలో ఆమె సంస్థ కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరిగింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం స్వాతి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు కళ్యాణ్ రామ్ అభిమానులు ఆమె గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. తెరపై హీరోగా కళ్యాణ్ రామ్ విజయాలు సాధిస్తుంటే.. తెరవెనుక స్వాతి కూడా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి