
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి సినిమా వందల కోట్లు వసూలు చేయడం సర్వసాధారణం అయిపోయింది కానీ, దాదాపు 18 ఏళ్ల క్రితమే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ఉన్న చిత్రం గురించి మీకు తెలుసా.. ? అవును ‘బాహుబలి’ కంటే ముందే బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి తెలుగు చిత్రంగా రామ్ చరణ్ నటించిన మగధీర రికార్డు సృష్టించింది. ఆ సమయంలో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసిన చిత్రమిది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘మగధీర’ చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతం. నేడు మనం చూస్తున్న ‘బాహుబలి’, ‘RRR’ వంటి భారీ చిత్రాలకు అసలైన పునాది ‘మగధీర’ సినిమానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2009లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచింది.
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చారిత్రక ప్రేమకథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 400 ఏళ్ల క్రితం నాటి ‘ఉదయ్‌ఘర్’ సామ్రాజ్యం, అందులో కాలభైరవగా రామ్ చరణ్ వీరోచిత పోరాటాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వంద మంది సైనికులతో ఒంటరిగా పోరాడే ఘట్టం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. రాజమౌళి విజన్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్‌గా మార్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
రామ్ చరణ్ తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఆయన నటన, డ్యాన్స్, గుర్రపు స్వారీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా విజయంతోనే చరణ్ ‘మెగా పవర్ స్టార్’గా ఎదిగారు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. మొత్తానికి, తెలుగు సినిమా కేవలం ఫ్యామిలీ డ్రామాలు లేదా యాక్షన్ సినిమాలకే పరిమితం కాదని, భారీ విజువల్ వండర్స్‌ను కూడా సృష్టించగలదని ‘మగధీర’ నిరూపించింది. నేడు రాజమౌళి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడానికి, ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లడానికి మగధీర సృష్టించిన ప్రభామే ప్రధాన కారణం. అందుకే ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..