Naga Chaitanya: నాగ చైతన్య హీరోయిన్ గుర్తుందా..? యంగ్ హీరోను ప్రేమించి పెళ్లాడింది..

|

Oct 17, 2024 | 5:17 PM

ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ మూవీ ఇది. అలాగే ఇదే కాంబోలో వచ్చిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య మంజిమా మోహన్ జంటగా నటించారు.

Naga Chaitanya: నాగ చైతన్య హీరోయిన్ గుర్తుందా..? యంగ్ హీరోను ప్రేమించి పెళ్లాడింది..
Sahasam Swasaga Sagipo
Follow us on

అక్కినేని నాగ చైతన్య, గౌతమ్ మీనన్.. ఈ ఇద్దరిది ఓ క్రేజీ కాంబో.. నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ మెమరబుల్ సినిమాలు తెరకెక్కించారు. ఈ కాంబోలో వచ్చి కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది ఏ మాయ చేశావే. ఇప్పటికి చాలా మంది ఫెవరెట్ మూవీ ఇది. అలాగే ఇదే కాంబోలో వచ్చిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య మంజిమా మోహన్ జంటగా నటించారు. 2016 నవంబరు 11న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

ఇక ఈ సినిమాలో నటించిన మంజిమా మోహన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్నది తన అందం అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమాతర్వాత  బాలయ్య బాబు నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నారా భువనేశ్వరిగా నటించింది మంజిమా మోహన్. ఇక ఈ అమ్మడు మలయాళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

మలయాళం ఈ చిన్నది బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఇక తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది మంజిమా మోహన్. 2017 లో దక్షిణాదిలో 64వ ఫిలిం ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నటిగా అందుకుంది. మంజిమా మోహన్ కు సినిమా రంగ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి విపిన్ మోహన్ సినీ ఛాయాగ్రాహకుడు, తల్లి కలమండలం గిరిజ నాట్యకారిణి. ఇక ఈ అమ్మడు సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 నవంబరు 28న చెన్నైలోని ఒక హోటల్ లో వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరూ.. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందని అభిమానులు గూగుల్ లో గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.