మంచు మనోజ్ నటించిన సినిమాల్లో బిందాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2010 రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 8 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మనోజ్ ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు షీనా షహబాది. ఈ ముద్దుగుమ్మ బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. తొలిసారిగా, నందీశ్వరుడు, యాక్షన్ 3డి, నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ అనే సినిమాల్లో నటించింది. అలాగే పలు హిందీ సినిమాల్లోనూ నటించింది. సినిమాల తర్వాత టీవీ సీరీయల్స్ లో నటించింది.
ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది షీనా. అలాగే వైభవ్ గోర్ ను షీనా వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. షీనా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది.
షీనా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీ లుక్స్ తో నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది ఈ చిన్నది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది షీనా..