ఏంటీ..! ఈ బ్యూటీ జై చిరంజీవలో మెగాస్టార్ మేనకోడలా..! గత్తర లేపిందిగా..

|

Sep 12, 2024 | 1:34 PM

ఇప్పటికే తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరో హీరోయిన్స్ గాసినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో జై చిరంజీవ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భుమిక, సమీరారెడ్డి హీరోయిన్స్ గా నటించారు.

ఏంటీ..! ఈ బ్యూటీ జై చిరంజీవలో మెగాస్టార్ మేనకోడలా..! గత్తర లేపిందిగా..
Jai Chiranjeeva
Follow us on

నిన్న మొన్నటి వరకు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వాళ్లు.. ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిపోతున్నారు. అంతే కాదు  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పటికే తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరో హీరోయిన్స్ గాసినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో జై చిరంజీవ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భుమిక, సమీరారెడ్డి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించిన చిన్నారి గుర్తుందా..?

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

ఆమె పేరు శ్రియ శర్మ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగా కనిపించింది. అలాగే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఆ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించింది. అలాగే గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకాదు. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.  ఇప్పుడు ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో .. చూస్తే అవాక్ అవ్వాల్సిందే.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

హీరోయిన్స్ ను మించిన అందంతో వయ్యారంతో ఆకట్టుకుంటుంది శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. బుల్లి గౌనులో అందాలతో ఆకట్టుకుంది శ్రియ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.