Tollywood : బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన రాజశేఖర్.. కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్..

నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 తాండవం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. ఇప్పుడు బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. కానీ మీకు తెలుసా.. బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాతో రాజశేఖర్ హిట్టు కొట్టారు.

Tollywood : బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన రాజశేఖర్.. కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్..
Balakrishna, Rajasekhar

Updated on: Jan 09, 2026 | 12:54 PM

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటారు డైరెక్టర్. సదరు హీరో మేనరిజం, కటౌట్, నటనకు తగినట్లుగా స్టోరీని క్రియేట్ చేసుకుంటారు. తీరా చూస్తే కొన్ని కారణాలతో ఆ సినిమాను మరో హీరోతో చేయాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలో మిస్సైన కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. డైరెక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో బాలకృష్ణ చేయాల్సిన సినిమా మిస్సైంది. చివరకు అదే కథతో హీరో రాజశేఖర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సముద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే సింహరాశి సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమ్మ సెంటిమెంట్‌తో కూడిన కథను తొలుత చాలామంది హీరోలు రిజెక్ట్ చేశారని అన్నారు. కానీ రాజశేఖర్ నమ్మకంతో ముందుకొచ్చారని తెలిపారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

డైరెక్టర్ వి. సముద్ర మాట్లాడుతూ.. అమ్మపై అభిమానంతో మదర్ సెంటిమెంట్ కథను రాశానని, దీనిని మొదట నాగార్జున, వెంకటేష్, విజయకాంత్, తమిళ విజయ్ వంటి అనేక మంది హీరోలకు వినిపించినా ఎవరూ ఒప్పుకోలేదని తెలిపారు. చివరకు ఆర్.బి. చౌదరి ద్వారా రాజశేఖర్‌కు కథ చేరిందని, ఇతర దర్శకులను కాదని రాజశేఖర్ తనకే అవకాశం ఇచ్చారని అన్నారు. షూటింగ్ సమయంలో రాజశేఖర్ సైతం సందేహపడ్డారని వెల్లడించారు. ఒకే డ్రస్సులో, కింద కూర్చుని ఉండే పాత్రను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అని తనతో అన్నారని.. కానీ నేను మాత్రం కథను నమ్ముకున్నట్లు చెప్పుకొచ్చారు. సింహరాశి రాజశేఖర్‌కు, తనకూ ఒక మైలురాయి చిత్రంగా నిలిచిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

తమిళంలో శరత్ కుమార్ హీరోగా వచ్చిన మాయి అనే ఒక మామూలు సినిమాను చూడమని చౌదరి చెప్పగా, ఆ సినిమా నచ్చి సింహరాశి కథకు ప్రేరణగా నిలిచిందని సముద్ర తెలిపారు. ఈ సమయంలోనే నరసింహనాయుడు చిత్రీకరణ జరుగుతుండగా బాలకృష్ణకు కూడా తన కథను చెప్పానని, బాలకృష్ణ తనకు చెన్నకేశవ రెడ్డి చిత్రాన్ని చేస్తానని మాట ఇచ్చారని అన్నారు. చివరికి సింహరాశి చిత్రాన్ని రాజశేఖర్‌తో చేయాలని నిర్ణయించారు. షిండే అనే మరో దర్శకుడితో పాటు తన పేరును కూడా చౌదరి ప్రస్తావించగా, రాజశేఖర్ మాత్రం దర్శకత్వ బాధ్యతలను తనకే అప్పగించారని సముద్ర గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

Loading...
Unable to load recommendations.
Follow Us