Tollywood: స్టార్ హీరోలతో లవ్, బ్రేకప్.. నిర్మాతలకు మాత్రం చుక్కలు.. 40 ఏళ్లైనా పెళ్లికి నో అంటోన్న హీరోయిన్..

|

Nov 30, 2024 | 6:05 PM

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఆ వయ్యారి.. ఇప్పుుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతుంది. కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తో కుర్రహీరోయిన్లకు పోటీనిస్తుంది.

Tollywood: స్టార్ హీరోలతో లవ్, బ్రేకప్.. నిర్మాతలకు మాత్రం చుక్కలు.. 40 ఏళ్లైనా పెళ్లికి నో అంటోన్న హీరోయిన్..
Actress
Follow us on

అతి చిన్న వయసులోనే కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ త్రిష. 1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన జోడి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న త్రిషకు తిరుగులేని బ్రేక్ ఇచ్చింది మాత్రం వర్షం సినిమానే. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్, త్రిష జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో త్రిషకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం త్రిష వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది.

కొన్నాళ్లపాటు ఆడపాదడపా చిత్రాలతో నెట్టుకొచ్చిన త్రిషకు.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే విజయ్ దళపతి సరసన లియో సినిమాతో సక్సెస్ అందుకుంది. అలాగే అజిత్ జోడిగా విదాముయార్చి చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా మలయాళంలో ఐడెంటిటీ, తమిళంలో కమల్ హాసన్ థగ్ లైఫ్, మలయాళంలో మోహన్ లాల్ రామ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటు సూర్య కొత్త ప్రాజెక్టులోనూ త్రిషను ఎంపిక చేశారట.

ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.1 కోటి తీసుకుంటుందని సమాచారం. అలాగే సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా త్రిష మారింది. ఇక మరికొంతకాలం త్రిష క్రేజ్ కొనసాగడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు త్రిష వ్యక్తిగత జీవితం గురించి ఎన్నోసార్లు రూమర్స్ వినిపించాయి. స్టార్ హీరోలతో ప్రేమ, బ్రేకప్ అంటూ నిత్యం ఏదోక వార్త హల్చల్ చేసింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.