
చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది మీనా. బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాలలో మెరిసిన మీనా.. ఆ తర్వాత కథానాయికగానూ స్టార్ డమ్ సంపాదించుకుంది. 13 ఏళ్ల వయసుకే హీరోయిన్ గా మారిన మీనా.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే మీకు తెలుసా.. ? ఎప్పుడూ స్టార్ హీరోలకు జోడిగా కనిపించే మీనా.. ఒకే హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించింది. అవును.. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో అనేక హిట్స్ వచ్చాయి. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. మలయాళీ హీరో మమ్ముట్టి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
మమ్ముట్టి, మీనా ప్రస్తుతం వీరిద్దరు కలిసి దృశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మీనా. 1984లో వచ్చిన మలయాళీ సినిమా ఒరు కోచుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి తో స్క్రీన్ షేర్ చేసుకుంది మీనా. ఇందులో రజని అనే చిన్నారి పాత్రలో నటించగా.. మమ్ముట్టి సురేంద్రన్ పాత్రలో కనిపించారు. ఇందులో తన ప్రేమికురాలి కూతురు మీనా కావడంతో తన సొంత కూతురిలా చూసుకుంటాడు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
ఆ తర్వాత రాక్షస రాజావు చిత్రంలో కథానాయికగా నటించింది మీనా. ఇందులో మమ్ముట్టి హీరోగా నటించారు. వీరిద్దరి కాంబోలో అప్పటికే మలయాళంలో వరుస సినిమాలు వచ్చాయి. అలాగే 2014లో విడుదలైన బాల్యకలసఖి అనే సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ రిలేషన్ ఒక ఫుల్ సర్కిల్ కు వచ్చింది. ఇందులో మమ్ముట్టికి తల్లి పాత్రలో కనిపించింది మీనా. ఆ సినిమాలో మమ్ముటటి డ్యూయల్ రోల్ (తండ్రి, కొడుకు) ప్లే చేశాడు. ఇందులో తండ్రి మమ్ముట్టికి భార్యగా మీనా కనిపించగా.. కొడుకు పాత్రలో ఉన్న మమ్ముట్టికి తల్లిగా కనిపించింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..