పేరుకే సీరియల్ సాంగ్.. వింటే ప్రేమలో పడిపోవాల్సిందే..! ఎంతో మంది ఫేవరెట్ పాట

కొన్ని పాటలు ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు. కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాదిస్తాయో ఆ సినిమాల్లో పాటలు కూడా అంతే హిట్ అవుతుంటాయి. మ్యూజికల్ హిట్ గా నిలిచినా సినిమాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర.. సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు కూడా మన దగ్గర ఉన్నాయి.

పేరుకే సీరియల్ సాంగ్.. వింటే ప్రేమలో పడిపోవాల్సిందే..! ఎంతో మంది ఫేవరెట్ పాట
Song

Updated on: Feb 13, 2026 | 11:53 AM

సంగీతం అనేది మనసుకు హాయి ని కలిగించడమే కాదు. కొన్ని రోగాలను కూడా నయం చేస్తుందని అంటుంటారు. ఓ చక్కటి సంగీతం వింటే మనసు తేలికవుతుంది. టెన్షన్స్, స్ట్రెస్ లాంటివి అంతో ఇంతో తగ్గుతాయి. ఇక సినిమా పాటలు ఎంతో మంది పై ప్రభావం చూపుతాయి. అది మంచిదైనా.. చెడ్డదైనా.. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. రీసెంట్ డేస్ లో ఒక్క సాంగ్ విడుదలైతే చాలు.. సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్.. ఇది ఒక ప్రేమ గీతం.. ఎంతో మంది ఫోన్స్ లోనూ ఈ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సాంగ్ సినిమా పాట కాదు అది ఒక సీరియల్ సాంగ్. ఆ సీరియల్ బుల్లితెరపై ఓ చరిత్ర సృష్టించింది.  సీరియల్ కాదు ఆ సాంగ్ కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా లేని రోజుల్లోనే దుమ్మురేపింది ఆ సాంగ్.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

తెలుగులో ఎన్ని సీరియల్స్ వచ్చిన ఈ సీరియల్ ను ఏదీ కొట్టలేదనే చెప్పాలి. ఆ సీరియల్ ఎదో కాదు చక్రవాకం. ఈ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం ఆడవారే కాదు, మగవాళ్ళు కూడా ఈ సీరియల్ ను తెగ చూసే వారు. అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సీరియల్ దాదాపు 3వేల ఎపిసోడ్స్ కు పైగా సాంగింది.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇక ఈ సీరియల్ కు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఆ సీరియల్ సాంగ్ కు కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకో నాకు ఈ ఆశలు అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. అందమైన ప్రేమ గీతం ఇది.ఈ సిరియాక్ కు బంటి సంగీతం అందించారు. అలాగే ఈ సాంగ్ ను బల భద్రపాత్రుని మధు రచించారు. అలాగే బంటి ఈ పాటను ఆలపించారు. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటుంది ఈ సాంగ్.

ఇవి కూడా చదవండి

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి