
ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దుసుకుపోతున్నారు. అంతే కాదు భారీ హిట్స్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే మన సీనియర్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. అంతే కాదు సీనియర్ హీరోలతో జతకట్టడానికి కుర్ర హీరోయిన్స్ కూడా వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే చాలా మంది కుర్ర హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించి హిట్స్ అందుకున్నారు కూడా.. కొంతమంది కూతురు వయసున్న హీరోయిన్స్ తోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. సినిమా అనేది వినోదం కోసమే.. సినిమాల్లో వయసును చూడరు. ఇటీవల సికిందర్ సినిమాల సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించడంపై ఏజే డిఫరెన్స్ అంటూ ట్రోల్స్ జరిగాయి. దీంతో విమర్శలపై గట్టిగానే స్పందించారు సల్మాన్.
కానీ గతంలో 64 ఏళ్ల స్టార్ హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్ నటించిన సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఎదో తెలుసా.? నటీనటులు ఎవరో తెలుసుకుందామా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో హీరోయిన్స్ ఎవరో కాదండి. సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోయిన్ సోనాక్షి సిన్హా. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా లింగా. డైరెక్టర్ కె. ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో విడుదలై డిజాస్టర్ అందుకుంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా సమయంలో రజినీ వయసు 64 సంవత్సరాలు.. కాగా.. సోనాక్షి వయసు కేవలం 27 సంవత్సరాలు కావడం గమనార్హం.
అయినప్పటికీ వీరిద్దరి జోడి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సినిమాకు మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. తమిళ్ లో పర్లేదు అనిపించుకున్నా.. తెలుగులో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 75 సంవత్సరాలు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. చివరగా కూలీ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఇప్పుడు జైలర్ 2 చిత్రీకరణంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి