Nana Patekar: రోజుకు 60 సిగరెట్లు.. 56 ఏళ్ల వయసులో రాత్రికి రాత్రే స్మోకింగ్ మానేసిన నానా పటేకర్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ ఆకస్మిక మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సినీ అభిమానులు ఈ సీనియర్ నటుడికి నివాళి అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానాజీకి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Nana Patekar: రోజుకు 60 సిగరెట్లు.. 56 ఏళ్ల వయసులో రాత్రికి రాత్రే స్మోకింగ్ మానేసిన నానా పటేకర్.. ఏం జరిగిందంటే?
Nana Patekar

Updated on: Oct 08, 2026 | 7:32 PM

బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణం అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఏడు పదుల వయసులోనూ చురుగ్గా ఉంటూ వర్కౌట్లు చేసే ఆయన గురువారం (అక్టోబర్ 08) గోవాలోని తని ఇంట్లోనే స్పృహ కోల్పోయి కనిపించడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను బతికించే ప్రయత్నంలో వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్‌ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇవాళ ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నానా మృతితో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సీనియర్ నటుడి మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా నానాజీకి ఆరోగ్య స్పృహ ఎక్కువ. ఏడు పదుల వయసులోనూ ఎంతో ఫిట్ గా ఉండేవారు. ఇందుకోసం వర్కౌట్లు కూడా చేసేవారు. ఈ నేపథ్యంలో నానా వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ సీనియర్ నటుడు చైన్‌ స్మోకర్‌ అట. రోజుకు 60 సిగరెట్లకు పైగా కాల్చేవారట. అలా 56 ఏళ్ల వయసు వరకు ఆయనకు ధూమపానం అలవాటు ఉండేదట. అలాంటి ఆయన ఒక్క రాత్రిలో ఈ పాడు అలవాటుని దూరం చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నానా పటేకర్ 2007-08లో ధూమపానం మానేశారట. అయితే అది చాలా ఆకస్మికంగా వచ్చిన మార్పు అని ఆయన అన్నారు. ఒక రోజు ఉదయం నిద్రలేచి ఇక సిగరెట్టు వద్దు అని అనుకున్నానని, మళ్లీ ఇప్పటి వరకు ముట్టలేదన్నారు నానాజీ. కాగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా ఛైన్ స్మోకర్. ‘కమాల్ ధమాల్ మలమాల్’ సినిమా కోసం నానాతో కలిసి పనిచేశారు ప్రియదర్శన్ .ఈ నేపథ్యంలో నానా పటేకర్ ప్రియదర్శన్‌ను ధూమపానం మానేసేలా ఒప్పించారు. ఆ తర్వాత తాను కూడా ఆ అలవాటుకి దూరం అయ్యాను అని చమత్కారంగా చెప్పారు.

దీంతో పాటు మరో కారణం వల్ల కూడా ఈ దురలవాటుని వదులుకున్నట్లు నానా పేర్కొన్నారు. ‘ నా స్నేహితుడి భార్య నాకు సోదరికంటే ఎక్కువ. ఆమె కొడుకుని పొగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ టైంలో నేను దగ్గుతూ తడబడుతూ మాట్లాడుతుండే వాడిని. అలా ఒకరోజు ఆమె నా వద్దకు వచ్చి ఏడుస్తూ ఇంకా ఏం బాధలు చూడాలో చెప్పు అని కోపంగా నిలదీసింది. అంతే.. ఆ రెండు సంఘటనలతో రాత్రికి రాత్రే సిగరెట్లు మానేయాలని స్ట్రాంగ్ గా డిసైడయ్యాను’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నానా. నానా పటేకర్ ఈ దురలవాట్లు వదులుకోవడమే కాకుండా తన తోటి నటీనటులకు కూడా వీటిని మానేయమని సలహా ఇచ్చేవారట. అంతేకాదు ఈ పాడు అలవాట్ల నుంచి బయటపడేందుకు కొన్ని సలహాలు, సూచనలు సైతం ఇచ్చేవారట. ముఖ్యంగా బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ ఖాన్‌కి కూడా నానా సలహా ఇచ్చారు. నటులకు సినిమాలే మంచి మెడిసిన్‌ అని. చెత్త అలవాట్లకు దూరంగా ఉండాలంటే మీరు సినిమాలు చేస్తూనే ఉండాలని అమీర్‌కి సూచించారు నానా. దాంతో అప్పటి నుంచే ప్రతి ఏడాది కనీసం తనది ఒక్క సినిమా అయినా ఉండేలా చూసుకుంటున్నానని అన్నారు అమీర్‌ ఖాన్‌. నానా పటేకర్ మరణం నేపథ్యంలో ఆయన చెప్పిన ఈ సలహాలు, సూచనలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఆమిర్ ఖాన్ తో నానా పటేకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us