Mouni Roy: ‘నాగిన్’ బ్యూటీ విడాకులు.. ప్రభాస్ హీరోయినే కారణమా? అసలేం జరిగింది?

బాలీవుడ్ టీవీ నటి మౌని రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌కు విడాకులు ఇచ్చింది. దీనికి ఒక స్టార్ హీరోయినే కారణమని చాలామంది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్ తో పాటు ఆ హీరోయిన్ పై కూడా సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.

Mouni Roy: నాగిన్ బ్యూటీ విడాకులు.. ప్రభాస్ హీరోయినే కారణమా? అసలేం జరిగింది?
Mouni Roy

Updated on: May 15, 2026 | 5:02 PM

బాలీవుడ్ టెలివిజన్ నటి మౌని రాయ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తాను వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు . అయితే , దీని తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. దీనికి ప్రధాన కారణం, ఈ విడాకుల విషయంలో నెటిజన్లు మౌని రాయ్ సన్నిహితురాలైన నటి దిశా పటానీని ట్రోల్ చేయడమే. గత కొన్ని రోజులుగా, మౌని రాయ్, సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న వదంతులు వ్యాపించాయి. దీనిపై స్పందిస్తూ, వారు విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘మా వ్యక్తిగత ప్రాధాన్యతలలో మార్పు కారణంగా, మేము పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఈ కష్ట సమయంలో దయచేసి మా గోప్యతను గౌరవించండి. ఎలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దు’ అని మౌని, సూరజ్ అభ్యర్థించారు.

మౌని రాయ్ తన విడాకుల పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో నటి దిశా పటానీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. మౌని, దిశా చాలా మంచి స్నేహితులు. తరచుగా కలిసి పార్టీలకు, ట్రిప్పులకు వెళ్తుంటారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆ జంట విడిపోవడానికి దిశా పటానీయే కారణమని నెటిజన్లు ఆరోపించడం మొదలుపెట్టారు. మరికొందరైతే చాలా నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. మౌని రాయ్, దిశా పటానీల స్నేహంపై అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.  కాగా తన ఫ్రెండ్ దిశా పటానీపై జరుగుతోన్న ట్రోల్స్‌ను ఆపడానికి మౌని రాయ్ తన విడాకుల పోస్ట్‌పై కామెంట్లను వెంటనే నిలిపివేసింది. అయినప్పటికీ ఆగని నెటిజన్లు మౌని రాయ్ పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల వద్దకు వెళ్లి దిశాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

దిశా పటానీతో మౌనీ రాయ్..

కాగా మౌనీ రాయ్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో 2022 జనవరిలో వివాహం జరిగింది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. గోవా వేదికగా జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక సంచలనం. అయితే నాలుగేళ్లకే వీరి వివాహ బంధం పెటాకులైంది. విడాకులు తీసుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us