Megastar Chiranjeevi: ‘పద్మ విభూషణ్’ చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్.. గడ్డం లేకుండా గురూజీ న్యూలుక్ చూశారా ?..

అల వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడక్కడా ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ.

Megastar Chiranjeevi: పద్మ విభూషణ్ చిరంజీవిని కలిసిన త్రివిక్రమ్.. గడ్డం లేకుండా గురూజీ న్యూలుక్ చూశారా ?..
Megastar Chiranjeevi, Trivi

Edited By:

Updated on: Jan 28, 2024 | 8:31 AM

మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి చిరంజీవిని కలిసి అభినందించారు. అలాగే సినీ పరిశ్రమలోని పలువురు దర్శక నిర్మాతలు, నటీనటులు చిరును నేరుగా కలిసి విష్ చేశారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో గురూజీ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ గడ్డంతో కనిపించే త్రివిక్రమ్ ఇప్పుడు గడ్డం లేకుండా ఇలా ఉంటారా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గడ్డం ఉంటేనే గురూజీ స్టైలీష్ గా కనిపిస్తాడని.. కానీ ఇప్పుడు ఈ లుక్ కూడా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజు కనిపించిన త్రివిక్రమ్ మళ్లీ కనిపించడం ఇదే మొదటిసారి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన గుంటూరు కారం సక్సెస్ పార్టీలోనూ ఆయన కనిపించలేదు. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన ఏ ప్రెస్ మీట్ లోనూ కనిపించలేదు. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అల వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడక్కడా ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.