Director Teja: అందమైన ప్రేమకథతో రానున్న దర్శకుడు తేజ.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తేజ. అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తేజ దిట్ట.

Director Teja: అందమైన ప్రేమకథతో రానున్న దర్శకుడు తేజ.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Teja

Updated on: Feb 23, 2022 | 5:21 PM

Director Teja: దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తేజ. అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తేజ దిట్ట. ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తేజ తన డ్రీమ్ ప్రాజెక్ట్ విక్రమాదిత్యసినిమాను ప్రకటించారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ప్రతిష్టాత్మకంగా ఈ ప్రేమకథను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో పేరున్న నిర్మాత కావ‌డంతో `విక్రమాదిత్యను` భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.

రైలు ఆవిరిలోనుండి హీరో హీరొయిన్లు రొమాన్స్ చేస్తున్న‌ట్లు చూపించారు. ఈ తరహా క్లాసిక్ ప్రేమ‌క‌థ‌ల‌ను ను తెరపై తొలిసారిగా చూడబోతున్నాం. ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే స‌మ‌యంలో సర్ ఆర్థర్ కాటన్ ధ‌వ‌లేశ్వరం బ్యారేజీని నిర్మించాడు. ఈ క‌థ ఆ కాలం నాటిద‌ని ఆ వంతెన‌కు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉంద‌ని తెలుస్తోంది. విక్రమాదిత్య షూటింగ్ 22:2:22 మధ్యాహ్నం 2:22 గంటలకు శుభ ముహూర్తంలో ప్రారంభ‌మైంది, ఆసక్తికరంగా తేజ యొక్క బ్లాక్ బస్టర్ జయం మూవీ షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సమయంలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియయనున్నాయి.

Vikramaditya

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : న్యూ లుక్ తో కేక పుట్టిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..