Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..

|

Apr 26, 2021 | 1:19 PM

Daggubati Abhiram: ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ సినిమా ఎంట్రీపై...

Daggubati Abhiram: అన్న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే లాంచ్ కానున్న అభిరామ్‌..? ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్‌..
Daggubati Abhiram
Follow us on

Daggubati Abhiram: ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ సినిమా ఎంట్రీపై గ‌తంలో చాలా సార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ ద‌గ్గుబాటి వారి అబ్బాయిని లాంచ్ చేయ‌నున్న డైరెక్ట‌ర్ల జాబితాలో వంశీ పైడిప‌ల్లి, ర‌వి బాబు, త‌రుణ్ భాస్క‌ర్ వంటి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. అయితే త‌ర్వాత ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది.
ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు అభిరామ్‌ను లాంచ్ చేయ‌న్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోలా కాకుండా ఈసారి ప‌క్కాగా అభిరామ్ ఇండ‌స్ట్రీ ఎంట్రీ జ‌రుగుతుంద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు తేజ‌. రానాకు.. నేనే రాజు నేనే మంత్రి వంటి సూప‌ర్ హిట్ అందించిన తేజానే అభిరామ్ తొలి సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే సురేశ్ బాబుకు ద‌ర్శ‌కుడు తేజ ఓ క‌థ చెప్పాడ‌ని.. దానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తేజ ప్ర‌స్తుతం “చిత్రం” సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో తేజ త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అటు ద‌ర్శ‌కుడు తేజ కానీ.. ఇటు ద‌గ్గుబాటి ఫ్యామిలీ కానీ అధికారికంగా స్పందించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Abhiram Teja

Also Read: ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం.. పూడ్చ‌లేని న‌ష్టమిది.. ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు అంటూ ట్వీట్..

Covid Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్న సూప‌ర్ స్టార్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్ బాబు..

‘చర్చలు చాలు, వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వండి’, కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన