RRR Movie : ఆర్ఆర్ఆర్‏కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. జక్కన్న బృందానికి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డు..

ఇటీవలే న్యూయార్క్ క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్‌లలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. తాజాగా మరో అరుదైన అవార్డ్ గెలుచుకుంది ఆర్ఆర్ఆర్.

RRR Movie : ఆర్ఆర్ఆర్‏కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. జక్కన్న బృందానికి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డు..
Ram Charan, Rajamouli, Ntr
Follow us

|

Updated on: Dec 06, 2022 | 12:49 PM

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు భారతీయులే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా జక్కన్న టైకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 1200 పైగా వసూళ్లు రాబట్టింది. తారక్.. చరణ్ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్న.. ట్రిపుల్ ఆర్ చిత్రంతో రికార్డ్స్ లను తిరగరాసాడు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మరోవైపు ఆస్కార్ అవార్డ్ కోసం పలు కేటగిరిలలో పోటి పడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవలే న్యూయార్క్ క్రిటిక్స్ ఇచ్చే అవార్డ్స్‌లలో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు రాజమౌళి. తాజాగా మరో అరుదైన అవార్డ్ గెలుచుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాదు.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డు సొంతం చేసుకుంది.

హాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హావా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు తాజాగా మరో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ ఏడాది అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డ్ గెలుచుకుంది. అలాగే.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే స్పాట్ లైట్ అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.