Shekar Kammula: ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఆ హీరోతోనేనా ?

Shekhar Kammula: ప్రేమకథలను మరింత అందంగా చిత్రీకరించడంలో ఆయన  ఆలోచన విధానమే వేరు. 'ఆనంద్' సినిమా నుంచి 'ఫిదా' సినిమా

Shekar Kammula: ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఆ హీరోతోనేనా ?
Shekar Kammula

Updated on: Apr 05, 2021 | 6:47 PM

Shekhar Kammula: ప్రేమకథలను మరింత అందంగా చిత్రీకరించడంలో ఆయన  ఆలోచన విధానమే వేరు. ‘ఆనంద్’ సినిమా నుంచి ‘ఫిదా’ సినిమా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టైల్ ప్రత్యేకం. అందుకే ఆయనకు యూత్‏తో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల… అక్కినేని నాగచైతన్య.. సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ గురించి యూత్ ఎప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్‏ ఈ మూవీపై ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ క్రమంలోనే లవ్ స్టోరీ చిత్రాన్ని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఏ హీరోతో తీయబోతున్నారనేది హాట్ టాపిక్‏గా మారింది. శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ విక్టరీ వెంకటేష్‏తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళినప్పుడు స్టేజ్ మీదే వెంకటేష్ తో త్వరలో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత వీరిద్ధరి సినిమాకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. తాజాగా శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తర్వాత మరోసారి మెగా హీరో వరుణ్ తేజ్‏తో కలిసి సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా గురించి పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇందులో వరుణ్ సరసన నానీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటించనున్నట్లుగా టాక్. అయితే ఇంతకుముందే వీరిద్ధరి కాంబోలో సూపర్ హిట్ మూవీ ఫిదా వచ్చిన సంగతి తెలిసిందే. మరీ నిజంగానే శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కాంబో రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Also Read: ఆ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఓ వైపు అనారోగ్యం.. మరో వైపు చలి.. కానీ పాట కోసం 16 గంటలు నీటిలో ఉన్న ‘తలైవి’ హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us