ఆ స్టార్ హీరోయిన్ అడ్వాన్స్ తీసుకొని.. 15 రోజుల షూటింగ్ తర్వాత సినిమా చేయను అని చెప్పింది..: ఎస్వీ. కృష్ణారెడ్డి

ఎస్.వీ కృష్ణారెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో మల్టీటాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు కృష్ణారెడ్డి. ఫ్యామిలీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అలీతో యమలీల‌లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎస్.వీ కృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.

ఆ స్టార్ హీరోయిన్ అడ్వాన్స్ తీసుకొని.. 15 రోజుల షూటింగ్ తర్వాత సినిమా చేయను అని చెప్పింది..: ఎస్వీ. కృష్ణారెడ్డి
Sv Krishna Reddy

Updated on: Jan 15, 2026 | 8:33 AM

ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు అభిమాన దర్శకుడు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి మెప్పించారు. కేవలం దర్శకుడిగానే కాదు నటుడిగాను మెప్పించారు కృష్ణారెడ్డి. చాలా కాలం తర్వాత ఇప్పుడు వేదవ్యాస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కృష్ణారెడ్డి. ఈ సినిమాలో కొత్తవారిని పెట్టి సినిమా చేస్తున్నారు. కాగా కృష్ణారెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఎస్.వి.కృష్ణారెడ్డి తన బ్లాక్ బస్టర్ సినిమా యమలీల గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాకు ఆలీని హీరోగా ఎంపిక చేయాలని తాను బలంగా నిర్ణయించుకున్నప్పుడు, సినీ పరిశ్రమలో చాలా మంది పెద్ద హీరోలు తమకు అవకాశం ఇవ్వమని అడిగారని ఆయన తెలిపారు.

ఆలీని కాకుండా మమ్మల్ని హీరోగా పెట్టండి అని చాలా మంది అడిగినా కూడా కృష్ణారెడ్డి తన విజన్‌పై నమ్మకంతో వెనకడుగు వేయలేదట. ఆలీ మాత్రమే ఆ పాత్రకు సరైన వ్యక్తి అని ఆయన గట్టిగా నమ్మారట. అయితే, హీరోయిన్ ఎంపిక విషయంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నారు. సౌందర్య మొదట యమలీలలో నటించడానికి నిరాకరించిందని.  అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా, చిత్రీకరణకు కేవలం 15 రోజులు సమయం ఉండగా, ఆమె సినిమా చేయనని చెప్పేసిందని కృష్ణారెడ్డి అన్నారు.  పెద్ద హీరో కాకపోవడం వల్ల సౌందర్య కొద్దిగా సంకోచించిందని కృష్ణారెడ్డి తెలిపారు.

ఆమె అప్పుడే పెద్ద హీరోయిన్ గా మారింది.. పెద్ద పెద్ద హీరోల పక్కన సినిమాలు చేస్తుంది. దాంతో ఆమె ఆలీతో చేయడానికి వెనకాడింది. దాంతో కృష్ణారెడ్డి ఆమె స్థానంలో ఇంద్రజను ఎంపిక చేశారు. ఇంద్రజను ఎంపిక చేసే ప్రక్రియ కూడా ప్రత్యేకంగా జరిగింది. ఒక షూటింగ్ సెట్‌లో చిన్న బేబీ లైట్‌లో ఇంద్రజను చూసిన కృష్ణారెడ్డి, ఆమె ముఖంలోని ఎక్స్ ప్రెషన్స్  తనకు నచ్చాయని తెలిపారు. యమలీల భారీ విజయం సాధించిన తర్వాత, సౌందర్య తన నిర్ణయం పట్ల పశ్చాత్తాపపడి, కృష్ణారెడ్డికి ఫోన్ చేసి తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని కోరిందని. శుభలగ్నం సినిమా సమయంలో ఆమె బాబు మోహన్‌తో కలిసి ఒక పాటలో నటించడానికి ఒప్పుకుందని తెలిపారు కృష్ణ రెడ్డి. ఇదే విధంగా, యమలీలలో కోట శ్రీనివాసరావు కూడా మొదట నటించడానికి నిరాకరించగా, ఆయన స్థానంలో తనికెళ్ళ భరణిని తీసుకున్నట్లు కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.