Director Krish: ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది.. డైరెక్టర్ క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో డైరెక్టర్ క్రిష్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా విభిన్న కంటెంట్.. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు.

Director Krish: ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది.. డైరెక్టర్ క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
Krish

Updated on: Feb 14, 2026 | 6:21 PM

తెలుగు సినీరంగంలో డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కంటెంట్ ప్రాధాన్యం ఇచ్చే దర్శకులలో ఆయన ఒకరు. సామాజిక అంశాలను వినూత్నంగా చూపించడం క్రిష్ స్టైల్. తెలుగులో గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్.. తొలి చిత్రంతోనే డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వేదం, కంచె వంటి చిత్రాలతో మెప్పించారు. ఇటీవల వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఘాటి చిత్రం సైతం నిరాశనే మిగిల్చింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఇక ఇప్పుడు క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో.. ట్రెక్కింగ్ నేపథ్యంతో కూడిన ఓ సినిమాను తెరకెక్కించనున్నారని.. అందులో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు నటించనున్నారని ప్రచారం జరిగింది. పర్వత ప్రాంతాలు, అడవుల మధ్య సాగే సర్వైవల్ డ్రామాగా ఈ సినిమా ఉండవచ్చని.. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఈ సినిమా కథను క్రిష్ సిద్ధం చేసుకున్నారని టాక్ నడించింది. తాజాగా ఈ రూమర్స్ పై క్రిష్ స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ఏడుగురు హీరోయిన్లతో సినిమా తీయాలనే ఐడియా బాగుందంటూ రియాక్ట్ అయ్యారు. “ఏడుగురు హీరోయిన్లు.. ట్రెక్కింగ్ అడ్వెంచర్.. ఐడియా బాగుంది. కానీ అది నా సినిమా కాదు. సోషల్ మీడియాలో ఎవరో తయారు చేసిన కథ అంతే” అంటూ ట్వీట్ చేశారు. తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..