
దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అజయ్ చేసింది మూడు సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమా చేశాడు. శర్వానంద్, సిద్దార్థ్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న అజయ్.. మంగళవారం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్ పుత్ నటించింది.
మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ తన నటనతో ఆకట్టుకుంది. ఒక అరుదైన మానసిక స్థితి కలిగిన యువతిగా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అజయ్ మరోసారి దర్శకుడిగా సత్తా చాటారు. ఇక ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే శ్రీనివాస్ మంగాపురం సినిమా తర్వాత అజయ్ మంగళవారం సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. మంగళవారం సినిమా సీక్వెల్ కోసం అజయ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి కొరటాల శివ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. అయితే మంగళవారం సినిమా సీక్వెల్ లో ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ సినిమా సీక్వెల్ లో శ్రీలీల నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై ఎలాంటి క్లారిటీ లేదు. మరి మంగళవారం సీక్వెల్ సినిమా కోసం కొత్త భామను తీసుకుంటారా.? లేక తెలిసిన హీరోయిన్ తోనే సినిమా చేస్తారా అన్నది చూడాలి.