
పై ఫొటోలో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? సినిమాలు, సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యివారేతై ఈ బ్యూటీని గుర్తు పట్టవచ్చు. మిగతా వారు మాత్రం అంత ఈజీగా గుర్తు పట్టలేరు. ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ మరికొన్ని సినిమాల్లో సెకెండ్ లీడ్ గా, హీరోలకు సిస్టర్ గా, వదినగా యాక్ట్ చేసింది. రామ్ చరణ్, నాగ చైతన్య, నాగార్జున, రవితేజ, రాజశేఖర్, పవన్ కల్యాన్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే కెరీర్ లో ఎక్కువగా ఇలాంటి పాత్రలే వస్తుండడంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ రావడం లేదు. అయితే ఇప్పడిప్పుడే ఈ ముద్దుగుమ్మకు మెయిన్ లీడ్ రోల్స్ వస్తున్నాయి. తన గత మూడు సినిమాల్లో రెండింటిలో మెయిన్ హీరోయిన్ గా నటించిందీ అందాల తార. విశాఖ పట్నం, హైదరాబాద్ నగరాల్లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మరెవరో కాదు రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ. ఇది ఆమె టీనేజ్ ఫొటోస్.
పూజిత ఈ ఏడాది కొంజం కాదల్ కొంజం మొదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీకాంత్ ఇందులో కథానాయకుడిగా కనిపించాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాలో నటించింది పూజిత. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ లో ఈ తెలుగమ్మాయి కనిపించనున్నట్లు సమాచారం. దీంతో పాటు భగవాన్ అనే ఓ తమిళ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది పూజిత.
ఇక సోషల్ మీడియాలో పూజితకు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.