Tollyood : 100కు పైగా సినిమాలు.. ఈ నటుడు గుర్తున్నాడా.. ? ఆయన కోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్..

తెలుగులో ఒకప్పుడు అనేక హిట్ చిత్రాల్లో నటించి తమదైన ముద్ర వేసిన సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. కానీ మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు సినిమాలతోపాటు అటు సీరియల్స్ సైతం చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన కోడలు తెలుగులో పాపులర్ హీరోయిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తనకంటూ మంచి ఫామ్ క్రియేట్ చేసుకుంది.

Tollyood : 100కు పైగా సినిమాలు.. ఈ నటుడు గుర్తున్నాడా.. ? ఆయన కోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్..
Prasad Babu

Updated on: Nov 29, 2025 | 9:54 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడు గుర్తున్నాడా.. ? ఒకప్పుడు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకు దాదాపు అందరు తెలుగు హీరోల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన పేరు ప్రసాద్ బాబు. హీరోలకు తండ్రిగా, మామగా, తాతగా, అన్నగా ఇలా అనేక కీరోల్స్ పోషించారు. సినిమాల్లో విలన్ పాత్రలు సైతం పోషించారు. సినిమాలే కాకుండా సీరియల్స్ సైతం చేశారు. అంతులేని కథ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. మన ఊరి పాండవులు చిత్రంలోనూ కనిపించారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉండిపోయారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు ఇలా అందరూ హీరోల సినిమాల్లో నటించారు. అలాగే సీరియల్స్ సైతం చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

మీకు తెలుసా.. ? ఈ సీనియర్ నటుడి కోడలు సైతం తెలుగులో తోపు హీరోయిన్. అవును.. ఆమె మరెవరో కాదు.. సంతోషిని. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీలో ఫరా పాత్రలో టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే సంతోషినికి సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె నటించలేదు. కొన్నాళ్లకు సిద్ధార్థ్, త్రిష కాంబోలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో పనిమనిషి పాత్రలో నటించింది. ఈ సినిమా సైతం ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

ఈ సినిమా తర్వాత బంగారం సినిమాలో విలన్ భార్యగా కనిపించింది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించిన సంతోషిని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె బ్యూటీషన్ రంగంలో దూసుకుపోతుంది. సొంతంగా బ్యూటీ, ఫ్యాషన్ సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

ఇవి కూడా చదవండి : Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..