Jabardasth Nemali Raju: జబర్దస్త్‌కు దూరమైన నెమలి రాజు ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఊహించలేదుగా

జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఛైల్డ్ ఆర్టిస్టుల్లో నెమలి రాజు ఒకరు. చూడ్డానికి పొట్టిగా కనిపించినా కామెడీ పంచులు పేల్చడంలో బాగా గట్టోడే. చాలా ఏళ్ల పాటు జబర్దస్త్ షో ద్వారా మనల్ని నవ్వించిన నెమలి రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడో తెలుసుకుందాం రండి.

Jabardasth Nemali Raju: జబర్దస్త్‌కు దూరమైన నెమలి రాజు ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఊహించలేదుగా
Jabardasth Nemali Raju

Updated on: Jun 09, 2026 | 10:57 AM

జబర్దస్త్ కామెడీ షో కారణంగా ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. ఈ షోలో చేసిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. మొన్నటివరకు ఈ కామెడీ షోలో ఛైల్డ్ ఆర్టిస్టులు కూడా చేసేవారు. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టీమ్ మొత్తమంతా చిన్న పిల్లలే కనిపించే వారు. తమ ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే వారు. యోధ, నిహాంత్, దీవెన, నరేష్, నెమలి రాజు తదితర ఛైల్డ్ ఆర్టిస్టులు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీవెన లాంటి మరికొందరు మాస్ జాతర టీవీ షోలో సందడి చేస్తున్నారు. అయితే నెమలి రాజు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో పొట్టి నరేష్ తో కలిసి నెమలి రాజు చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. చాలా ఏళ్ల పాటు ఈ షోలో చేసిన నెమలి రాజు ఇప్పుడు జబర్దస్త్ కు దూరమైపోయాడు. అంతేకాదు ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు.

అయితే టీవీ షోలకు పూర్తిగా దూరమైన నెమలి రాజు ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉంటున్నాడు. ముఖ్యంగా స్టార్ మాలో వచ్చే ఓ సీరియల్‌లో అతను ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నాడు. అందులో సూపర్ హిట్ సినిమాల స్ఫూప్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు బయటి ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడీ జబర్దస్త్ ఆర్టిస్ట్.

గతేడాది ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు నెమలి రాజు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పటాస్, జబర్దస్త్ రైటర్ రాజు నన్ను చూసి ‘జబర్దస్త్’ లోకి తీసుకున్నారు. జబర్దస్త్ షో వల్ల నేను సెటిలయ్యాను. మా ఇంట్లో ఆర్థిక పరమైన కష్టాలు తీరాయి. అయితే కొన్ని కారణాలతో నేను ఈ షో నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు సీరియల్స్ లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మెగా బ్రదర్ నాగబాబుతో నెమలి రాజు..

జబర్దస్త్  నెమలి రాజు మరిన్ని ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us