తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఒక్కసారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ షోకు ఎలాంటి తావివ్వకుండా.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూ.. ఆ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ చేసిన నటనకు ప్రశంసల వర్షం కురిసింది. నార్త్ నుంచి వచ్చినా.. తక్కువ సమయంలోనే సౌత్ ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే దెబ్బకు అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే వెంటనే వెంటనే వచ్చిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయకుండా… కంటెంట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మరీ అచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఈ ముద్దుగుమ్మ కెరీర్లో ఇటీవల తెలుగులో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ప్రత్యేకమని చెప్పుకొవాలి. మరి ఇంతకీ ఆమెవరో చెప్పగలరా..? ఇప్పటికైనా గుర్తుపట్టారా.?
ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. మొదటిగా సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంతరం పలు చిత్రాల్లో ఆమె నటించినా.. పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే 2018లో విడుదలైన హిందీ చిత్రం ‘సూపర్ 30’తో మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకుంది. ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ మూవీస్‌తో తన నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.
అలాగే 2022లో తెలుగులో రిలీజైన ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్.. దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ సాధించింది. ఇక ఇప్పుడు హిందీలో 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు కుర్రకారులో పిచ్చ ఫాలోయింగ్ సాధించడమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘సీత’గా మరింత దగ్గరైంది.