
నటీనటుల వృత్తిలో పాత్రలకు ఎటువంటి పరిమితులు ఉండవు. ఒకే సినిమాలో ఒక హీరోకి హీరోయిన్‌గా నటించిన నటి, మరో చిత్రంలో ఆయనకు సోదరిగానో, తల్లిగానో కనిపించడం మనం తరచుగా చూస్తుంటాం.. మంది హీరోయిన్ ఒకే హీరోకు తల్లిగాఎం , భార్యగా, సోదరిగా నటించిన వారు ఉన్నారు.. ఉదాహరణకు లేడీ సూపర్ స్టార్ నయనతార సైరా చిత్రంలో చిరంజీవి సరసన నటించగా, గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించారు. ఆతర్వాత వచ్చిన మన శంకర వర పరసాద్ గారు సినిమాలో భార్యగా నటించారు. అయితే, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మాత్రం ఒక నటిని తన తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా అంగీకరించడానికి నిరాకరించారని మీకు తెలుసా.? దీనికి గల కారణం ఆసక్తికరంగా ఉంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఎందుకు విజయ్ సేతుపతి ఆమెను హీరోయిన్ గా ఒప్పుకోలేదంటే..
ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.. ఆ సినిమాతోనే విజయ్ సేతుపతి నేరుగా తెలుగులో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశారు. అంతకు ముందు సైరా సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. కాగా ఉప్పెన సినిమాలో కృతి శెట్టి విజయ్ సేతుపతి కుమార్తె పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత, ఒక తమిళ సినిమాకు దర్శకుడు కృతి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేసి, సేతుపతికి ఆమె ఫోటో చూపించారట. అయితే, కృతిని చూడగానే సేతుపతి వెంటనే నో చెప్పేశారని తెలిసింది. తాను తన కుమార్తెగా భావించిన వారితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించిన సేతుపతి, ఉప్పెన చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.
కృతి శెట్టి ఆ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, సేతుపతి ఆమెను ఓదార్చారట. తనకు నిజ జీవితంలో అదే వయసున్న కుమార్తె ఉందని, కృతిని కూడా తన కూతురిలాగే భావించాలని చెప్పి ధైర్యం ఇచ్చారట. దీంతో కృతి టెన్షన్ లేకుండా ఆ సన్నివేశాన్ని పూర్తి చేయగలిగిందట. ఆ క్షణం నుంచి, సేతుపతి కృతిని నిజంగానే తన కూతురిలాగే భావించడం ప్రారంభించారని వెల్లడించారు. వృత్తిపరంగా నటీనటులు ఎలాంటి పాత్రలకైనా సిద్ధంగా ఉండాలి అన్నప్పటికీ, వ్యక్తిగత భావోద్వేగాలు కొన్నిసార్లు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. తన కూతురిలా భావించిన కృతి శెట్టితో రొమాంటిక్ పాత్రలో నటించడం తన మనస్సాక్షికి విరుద్ధమని సేతుపతి భావించారట. ఈ కారణంతోనే, ఆయన ఆమెను తన చిత్రంలో హీరోయిన్‌గా వద్దని తేల్చి చెప్పేశారు. దాంతో కృతి స్థానంలో వేరొక నటిని ఎంపిక చేశారట. ఎంతైనా విజయ్ సేతుపతి నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.