Tollywood: ఆ నవ్వుకు అయిపోతాయ్ కుర్రాళ్ల హృదయాల బేజారు.. ఈ సొగసరి ఎవరో కనిపెట్టగలరా.?
ఈ నవ్వుల నయాగారం.. సినీ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలమే అయింది. టాలీవుడ్‌లో చేసింది నాలుగు సినిమాలే.. కానీ..

ఈ నవ్వుల నయాగారం.. సినీ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలమే అయింది. టాలీవుడ్‌లో చేసింది నాలుగు సినిమాలే.. కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో సందడి చేయనుంది. ఎవరో గుర్తుపట్టారా.? ఇంకా కనిపెట్టలేకపోయారా.? అయితే మీకో చిన్న క్లూ.. తెలుగు తెరపై ఆమె నటించిన తొలి చిత్రంలోని హీరో అక్కినేని నాగచైతన్య. హా! మీరు అనుకున్నది కరెక్టే.. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.. ఆమెవరో హీరోయిన్ దివ్యాంషా కౌశిక్.
2019లో ‘మజిలీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే ఫ్యాన్స్‌కు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత 2021లో ‘ది వైఫ్’ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేసింది. మళ్లీ తెలుగులో మూడేళ్ల తర్వాత అంటే 2022లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు మాత్రం ఆమెకు ఏమాత్రం పేరు తెచ్చిపెట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్‌గా మిగిలాయి. ఇక ఇప్పుడు 2023, ఫిబ్రవరి 3న ‘మైకేల్’తో సందడి చేయనుంది. అలాగే సుదీర్ వర్మ డైరెక్షన్‌లోనూ ఓ మూవీలో నటిస్తోంది. అటు తమిళంలో ‘టక్కర్’ అనే చిత్రం చేస్తోంది.
View this post on Instagram