ఏంటీ.. ఈ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ ఫ్రెండా..!! ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

ఏంటీ.. ఈ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ ఫ్రెండా..!! ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
Prabhas

Updated on: Dec 19, 2025 | 6:02 PM

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కుతుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరక్కుతుంది. అలాగే ఈ మూవీ ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు హనురాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

ఇదిలా ఉంటే ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్‌లో చాలా ఫెమస్ అని మీకు తెలుసా.? జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కామెడీ షోకు మంచి క్రేజ్ ఉంది.. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు కమెడియన్స్‌గా సినిమాల్లోనూ ఛాన్స్‌లు అందుకున్నారు. అలాగే కొందరు హీరోలుగా.. దర్శకులుగా మారారు. కాగా జబర్దస్త్ లో చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ ఫ్రెండ్ కూడా జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఆయన. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

జబర్దస్త్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్‌లో అదిరే అభి ఒకరు. చాలా మంది అభిమాన కమెడియన్ అదిరే అభి. జబర్దస్త్ లో స్కిట్స్ చేయకముందు పలు సినిమాల్లో నటించాడు అదిరే అభి.. ఈ క్రమంలోనే ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ లోనూ నటించాడు. ఆ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించాడు అభి. గతంలో ఓ ఇంటర్వ్యూలో అభి మాట్లాడుతూ.. ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. ఆయన ఎంత పెద్ద హీరో అయినప్పటికీ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అని చెప్పారు అదిరే అభి.

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.