ఇదెక్కడి మాస్ రా మావ..! విజయ్ దేవరకొండ , తమన్నా కలిసి నటించారా.!! వీడియో చూస్తే షాక్ అవుతారు.

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ రణబాలి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి అనుకున్నట్టుగానే ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది.

ఇదెక్కడి మాస్ రా మావ..! విజయ్ దేవరకొండ , తమన్నా కలిసి నటించారా.!! వీడియో చూస్తే షాక్ అవుతారు.
Tamannaah , Vijay Deverakon

Updated on: Oct 16, 2026 | 3:10 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మనవి పాజిటివ్ టాక్ వస్తుంది. టాలీవుడ్‌లో రౌడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తనదైన స్టైల్‌, యాటిట్యూడ్‌తో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టిన విజయ్.. ఇప్పుడు టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. తాజాగా రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు. రిలీజ్ కు ముందు రణబాలి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా విజయ్ సంబంధించిన ఓ పాత యాడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ ఆయన కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్నాడు. ఈ చిత్రంతో యూత్‌కు మరింత దగ్గరైన విజయ్.. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన నటనతో పాటు ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే ప్రతి సినిమాతోనూ విజయాన్ని అందుకోకపోయినా, విజయ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆయన కొత్త సినిమాల ప్రకటనలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు, గతంలో చేసిన పనులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కాగా విజయ్ దేవరకొండ పలువురు స్టార్ హీరోయిన్లతో కలిసి సినిమాల్లో నటించాడు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో కలిసి విజయ్ ఓ యాడ్ లో కనిపించాడనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా కోసం కాకుండా, ఓ కమర్షియల్ యాడ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

తమన్నా తన కెరీర్ ప్రారంభ దశలో పలు బ్రాండ్ల ప్రకటనల్లో నటించింది. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ సెల్‌కాన్‌కు సంబంధించిన ప్రకటనలోనూ ఆమె కనిపించింది. ఈ యాడ్‌లో విజయ్ దేవరకొండ కూడా ఉండటంతో, ప్రస్తుతం ఆ వీడియోను నెటిజన్లు అట్రాక్ట్ చేస్తుంది. ఈ యాడ్‌లో విజయ్ దేవరకొండ లుక్ ఇప్పుడు అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ హీరోగా కనిపిస్తున్న విజయ్.. అప్పటి యాడ్ లో చాలా యంగ్‌గా, కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఆయన పాత లుక్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా, విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us