Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వద్దన్న కథతో ఆ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా

పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా  సినిమాలను లైనప్ చేసి ఉన్నారు. ఎప్పటి నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ ను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఓజీ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. వీటితో పాటు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వద్దన్న కథతో ఆ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:52 PM

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక పై సినిమాలు చేస్తారా.? చేయరా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా  సినిమాలను లైనప్ చేసి ఉన్నారు. ఎప్పటి నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ ను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఓజీ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. వీటితో పాటు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాల పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే పవన్ రిజక్ట్ చేసిన సినిమాతో ఓ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆహీరో ఎవరో.? ఆసినిమా ఎదో తెలుసా.?

గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుసగా లవ్ స్టోరీస్ తో హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ దగ్గరకు మరో లవ్ స్టోరీ వచ్చిందట.. కానీ ఆ సినిమాకు పవన్ నో చెప్పారు. దాంతో ఆ సినిమాను ఓ చిన్న హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమానే నువ్వే కావలి. తరుణ్, రీచా హీరో హీరోయిన్స్ గా నటించిన నువ్వే కావలి సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

అయితే ఈ సినిమా కథ ముందుగా పవన్ కళ్యాణ్ కు వినించారట. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారట. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో అమీషాపటేల్ హీరోయిన్ గా రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న తర్వాత అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందట. ఆతర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూసినా పవన్ వద్దన్నారట. దాంతో ఆ సినిమాను వదిలిపెట్టారట. ఆతర్వాత ఇదే కాంబినేషన్ లో ఖుషి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆగిపోయిన అదే కథతో విజయ్ భాస్కర్ తరుణ్, రీచాతో నువ్వేకావలి అనే టైటిల్ తో తెరకెక్కించారట. రామోజీరావు, స్రవంతి రవికిషోర్ నిర్మాతలుగా వ్యవహరించిన. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీగా కలెక్షన్స్ సాధించింది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు రాశారు.

ఇది కూడా చదవండి :చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో