Savitri: సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే లెజెండరీ సింగర్.. కారణమిదే

మహానటి సావిత్రిని ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి నటించిన తోటి హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా ఆమెను ఎంతో అభిమానిస్తారు. అయితే లెజెండరీ సింగర్ జానకి మాత్రం సావిత్రి సినిమాలకు పాటలు పాడనని చెప్పారట. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.

Savitri: సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే లెజెండరీ సింగర్.. కారణమిదే
Savitri, Janaki

Updated on: May 22, 2026 | 5:49 PM

మహానటి సావిత్రి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆమె అందం, అభినయానికి ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతుంటారు. అన్నిటికీ మించి సావిత్రికి ఉన్న దానగుణం ప్రతీ ఒక్కరికి ఆమెపై గౌరవాన్ని పెంచింది. అందుకే సావిత్రితో కలిసి నటించిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఆమె గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అలాగే చివరి రోజుల్లో మహానటి అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, ఆమె మరణం గురించి తెలుసుకుని కన్నీరు పెట్టనివారంటూ ఉండరు. అయితే స్టార్ సింగర్ జానకి మాత్రం సావిత్రికి నేను పాటలు పాడననిచెప్పేశారట. చివరి వరకూ అదే మాట మీద ఉన్నారట. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వేల పాటలు పాడారు జానకి. అప్పటి అంజలి, సావిత్రి, కాలం నుంచి ఈ కాలం హీరోయిన్ల వరకూ మూడు తరాల తారలకు పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు జానకమ్మ. అలాగే ఎంతో మంది హీరోయిన్లకు కూడా పాటలు పాడిందమె. అయితే మహానటి సావిత్రికి మాత్రం పాడను అని చెప్పేశారట. ఈ విషయాన్ని స్వయంగా జానకమ్మనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచచారు.

సావిత్రికి కెరీర్ ప్రారంభం నుంచి నుంచి ఎక్కువగా పాటలు పాడింది పి.లీల. మహానటి నటించిన మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల్లో లీల.. సూపర్ హిట్ పాటలు ఆలపించారు. ఆతర్వా సుశీలమ్మకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారట సావిత్ర. తన పాటలను సుశీలమ్మ మాత్రమే పాడాలి అని రూల్ కూడా పెట్టే వారట. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ ఓ తమిళ సినిమాలో సావిత్రి పాటను ఆలపించింది. పాట కూడా ఎంతో అద్భుతంగా వచ్చంది. అయితే సావిత్రం మాత్రం జానకమ్మ పాడిన పాటను మళ్లీ సుశీలమ్మతో రీ టేక్ పాడించారట. అంతే అప్పటి నుంచి సావిత్రి పాటలను పాడకూడదని నిర్ణయం తీసుకున్నాట జానకమ్మ.

సావిత్రి విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జానకమ్మ.. ‘ సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేవారు కాదు. నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను అనిచెప్పేశాను. సావిత్రి నటించడంతో ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని దర్శక నిర్మాతలు చెప్పడంతో పాడటానికి అంగీకరించాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us