Prabhas: ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే.. రాజమౌళి కాకుండా ఎవరంటే..

ఇద్దరి కాంబోలో మొదటిసారి వచ్చిన చత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్.. జక్కన్న డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి చిత్రం డార్లింగ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, డార్లింగ్ పేర్లు మారుమోగాయి. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్

Prabhas: ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే.. రాజమౌళి కాకుండా ఎవరంటే..
Prabhas
Follow us

|

Updated on: Apr 19, 2024 | 4:46 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో హీరోగా మొదలైన ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కు సేపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇద్దరి కాంబోలో మొదటిసారి వచ్చిన చత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్.. జక్కన్న డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి చిత్రం డార్లింగ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, డార్లింగ్ పేర్లు మారుమోగాయి. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. కానీ బాహుబలి అంతటి స్థాయిలో మరోసారి విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు.

ఇదిలా ఉంటే… తాజాగా ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఓ రేర్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ప్రభాస్ గురించి మాట్లాడుతూ..డార్లింగ్ ను అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేశాడు జక్కన్న. ఆ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. “ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి సెంథిల్. కెమెరామెన్ సెంథిల్ మాత్రమే. ఎందుకంటే బాగా పర్ఫెక్షనిస్ట్.. నాకంటే కూడా పర్ఫెక్షనిస్ట్.. ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. అది ప్రభాస్‏కు కోపం తెప్పి్స్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్.. ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు” అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‏తోపాటు మ్యానరిజం కూడా అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఈ రేర్ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. రాజమౌళిలో ఓ నటుడు కూడా ఉన్నాడని.. ప్రభాస్ ను అచ్చం దింపేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపైనే ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ ఏడాదిలోనే కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రాజమౌలి మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.