Disha Patani: అలాంటి రోల్స్‌ చేయడమే ఈ అమ్మడి కొంప ముంచాయా..?

|

Apr 09, 2023 | 12:39 PM

ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించటంతో దిశకి పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు దిశా. అంతేకాదు ఫిలిం ఈవెంట్స్‌లోనూ గ్లామర్‌ షోతో రచ్చ చేస్తున్నారు.

Disha Patani: అలాంటి రోల్స్‌ చేయడమే ఈ అమ్మడి కొంప ముంచాయా..?
Disha Patani
Follow us on

సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశ పాట్నీ కెరీర్‌లో ఇప్పుడిప్పుడే హై మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించటంతో దిశకి పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు దిశా. అంతేకాదు ఫిలిం ఈవెంట్స్‌లోనూ గ్లామర్‌ షోతో రచ్చ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గ్లామర్‌ బ్యూటీ దిశ పాట్నీ. అయితే సౌత్‌లో సక్సెస్‌ రాకపోవటంతో నార్త్‌కు షిప్ట్ అయిన ఈ బ్యూటీ, కెరీర్‌ స్టార్టింగ్‌లో ఇంట్రస్టింగ్ మూవీస్ చేశారు. ధోని బయోపిక్‌, కుంగ్‌ఫూ యోగా లాంటి సినిమాలు దిశకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

కానీ నెమ్మది గ్లామర్ రోల్స్‌కు షిఫ్ట్‌ అవ్వటంతో దిశ కెరీర్‌ స్లో అయ్యింది. వరుసగా యాక్షన్‌ స్టార్స్‌తో జోడి కట్టడంతో ఏ సినిమాలోనూ పర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేకుండా పోయింది. వరుస అవకాశాలు వస్తున్నా.. హీరోయిన్‌గా బిజీ అన్న రేంజ్‌లో ఆఫర్స్ మాత్రం రాలేదు.

ఓ వైపు తన కాంటెంపరరీ హీరోయిన్స్‌ కృతి సనన్‌, కియారా అద్వానీ స్టార్ ఇమేజ్‌తో పాటు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే. దిశ మాత్రం కమర్షియల్ హీరోయిన్‌గా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు తన కెరీర్‌ను మలుపు తిప్పుతాయన్న నమ్మకంతో ఉన్నారు దిశ. సిద్ధార్థ్‌కు జోడిగా నటిస్తున్న యోధా, విమెన్‌ సెంట్రిక్ కథతో తెరకెక్కుతున్న కే టీనా, సౌత్ స్టార్ సూర్యకు జోడిగా నటిస్తున్న సినిమాలు తన ఇమేజ్‌ను మార్చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సినిమాలతోనే కాదు ఆఫ్ స్క్రీన్‌ లుక్స్‌తోనూ వావ్ అనిపిస్తున్నారు ఈ బ్యూటీ.. రీసెంట్ టైమ్స్‌లో దిశ పబ్లిక్ అపియరెన్స్‌లు ప్రతీ సారి హాట్ టాపిక్ అవుతున్నాయి. గ్లామర్‌ షోకి కొత్త హైట్స్‌ చూపిస్తూ.. కేక పెట్టిస్తున్నారు దిశ. మరి ఈ ఇమేజ్‌ అమ్మడి ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.