Dia Mirza Clarification : నాగార్జున వైల్డ్‌డాగ్ మూవీతో తెలుగు తెరపై సందడి చేసిన హైదరాబాదీ భామ దియామీర్జా అందరికి గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు పెళ్లికి ముందే గర్భవతి అయ్యారా అని ఓ అభిమాని అడగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పింది.
ఈ విషయం ముందు చెప్పడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ అప్పటికే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పింది.. అందుకే అంతా సవ్యంగా సాగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని అందుకే చెప్పలేదని వెల్లడించింది. ప్రెగ్నెన్సీ అనేది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన జీవితమని ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పడంలో మరే ఉద్ధేశ్యంలేదని వెల్లడించింది.
ఇక బిడ్డను కనాలనుకునే మహిళ పెళ్లికి ముందా తర్వాత అనేది ఆమె వ్యక్తిగత విషయమని.. ఇందులో సమాజం ఏమనుకుంటుందో అనే భయం అక్కరకు రానిదని కుండ బద్దలు కొట్టింది.కాగా తొలుత, నిర్మాత సాహిల్ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం డివోర్సీ అయిన వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో జరిగింది.