
బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. ఇదిలా ఉంటే తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న నటి దీపికా పదుకొణె శనివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. భర్త రణవీర్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దక్షిణ ముంబైలోని HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కు వచ్చింది దీపిక . రణ్వీర్-దీపిక ఆసుపత్రిలోకి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అంతకు ముందు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ముంబైలో గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లి సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. గణేశుడి దర్శనం కోసం వచ్చే సమయంలో దీపిక బాగానే కనిపించింది. అయితే సాయంత్రానికే ఆమె అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరింది.
వాస్తవానికి ఈ నెల 28న దీపికా పదుకొణెకు డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. కానీ దీపికా, రణవీర్ సింగ్ లు శనివారమే హాస్పిటల్ కి రావడం చూస్తుంటే ఆదివారం లేదా సోమవారం ఆమె ప్రసవించనుందని తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లది ప్రేమ వివాహం. 2018 సంవత్సరం నవంబర్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దాంపత్య బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డ ఇప్పుడు వీరి జీవితంలోకి అడుగు పెట్టనుంది. ఇదిలా ఉంటే దీపిక లండన్లో ప్రసవించనుందని వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు అదంతా అబద్ధంమని తేలింది. దీపికా మొదటి బిడ్డ ముంబైలోనే జన్మించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.