టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన ఫీల్ గుడ్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇక సినిమాలో నవీన్ నటనపై ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్స్‌లోనే కనిపించిన పొలిశెట్టి ఈ సినిమాలో తన నటనతో కన్నీళ్లు కూడా తెప్పించాడు. ఇక ఓటీటీలోనూ నవీన్ పొలిశెట్టి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే ఈ మూవీని చూసిన దినేష్ కార్తీక్ నవీన్ పొలిశెట్టి సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి రొమాన్స్ కామెడీ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. సినిమా చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంది. ఇక హీరో నవీన్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లాడు’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.
దినేశ్ కార్తీక్ పోస్టుపై హీరో నవీన్ పొలిశెట్టి కూడా స్పందించాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు దినేష్ కార్తీక్. ఈ వరల్డ్ కప్‌లో మీ కామెంటరీని ఇష్టపడుతున్నాను. లెట్స్ గో ఇండియా’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్, నవీన్ పొలిశెట్టిల పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో పవిత్రా లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, రోహిణీ, మహేష్, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది.
“Loved #MissShettyMrPolishetty . Worth the wait. Light hearted and funny. Yet again @NaveenPolishety has chosen a super script and aced it in this warm hearted comedy “- Indian cricketer Dinesh Karthik praises Naveen Polishetty after watching movie on Netflix pic.twitter.com/eCVkCXPbfq
— Vamsi Kaka (@vamsikaka) November 8, 2023
So much love for #MissShettyMrPolishetty. Thank you so much @DineshKarthik ❤️ loving your commentary in this World Cup. Let’s go India 🙏💪🔥 #CW2023 https://t.co/RcwG4XFZPi
— Naveen Polishetty (@NaveenPolishety) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.