Actor Ali: ఆ తెలుగు హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు.. నటుడు అలీ కామెంట్స్ వైరల్

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన కమెడియన్ అలీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా మారుతున్నారు. అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన అలీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే..

Actor Ali: ఆ తెలుగు హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు.. నటుడు అలీ కామెంట్స్ వైరల్
Actor Ali

Updated on: Jul 05, 2026 | 12:57 PM

బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలీ. ఆతర్వాత కమెడియన్‌గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. హీరోగానూ సత్తా చాటారు. ఇప్పటివరకు సుమారు 1100కు పైగా సినిమాలు చేసిన అలీ బుల్లితెరపై కూడా సత్తా చాటారు. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరించారు. ఆ మధ్యన రాజకీయాల్లోకి కూడ అడుగు పెట్టిన ఆయన కొన్నేళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం పాలిటిక్స్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించిన అలీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా మారుతున్నారు. అయితే తాజాగా మహేంద్ర గిరి వారాహి సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు అలీ. అక్కినేని సుమంత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన అలీ అక్కినేని ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యారు.

 

ఇవి కూడా చదవండి

‘ అక్కినేని ఫ్యామిలీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వర రావు నాకు గురువు లాంటి వారు. ఆయనతో జనరల్ గా ఎవరు జోకులు వేయరు. కానీ నాగార్జున మాత్రం నన్ను పిలిచి ‘ అలీ.. నాన్న గారు ఒక్కరే ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి ఏదైనా జోకులు వేయి’ అని నాకు చెప్పేవారు. అలా నేను, ఏఎన్నార్ కలిసినప్పుడల్లా ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. అప్పటి హీరోయిన్లు, హీరోలు, అప్పట సినిమాలు.. ఇలా తన పాత విషయాలన్నీ నాతో పంచుకునేవారు. ఏఎన్నార్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను ఆయన పక్కన నటిస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో సుమారు 40 సినిమాల్లో యాక్ట్ చేశాను. ఆ అదృష్టం నాకు దక్కింది. ఒకసారి ఆయన పుట్టిన రోజు నాడు.. ‘ నాకు బర్త్ డేం ఏం వద్దు కానీ.. నేను కొంత మంది పేర్లు చెబుతాను. వాళ్లను ఇంటికి పిలిచి వాళ్ల చేతిలో ఏదైనా బంగారం చైన్ వేయండి. ఆయన ఎవరి పేర్లు చెప్పాడో తెలుసా? రాఘవేంద్ర రావు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, కోడి రామకృష్ణ గారు, ఆర్ నారాయణ మూర్తి గారితో పాటు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో ఆయన గోల్డ్ చైన్ వేస్తుంటే మా అమ్మ నా పక్కనే ఉంది’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు అలీ. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స నెట్టింట వైరల్ గా మారాయి.

భార్యతో అలీ..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us