Tollywood : బడా సినిమాలకు భారీ షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని నిర్ణయించింది. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇక పై చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదు…కేవలం నాలుగు షో లు మాత్రమే.. అలాగే అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ను నిర్ణయించింది. గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలు కు పైగా థియేటర్లో అమ్మిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అన్ని సినిమాలకు ఒకటే రేటు ఉండనుంది. ఇదిలా ఉంటే రాబోయే సినిమాలన్నీ పెద్ద సినిమాలే.. దాంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, బాలయ్య అఖండ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల్లో బడా సినిమాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే పుష్ప, ఆచార్య, భీమ్లా నాయక్, అఖండ సినిమాల నిర్మాతలకు, డిస్టిబ్యూటర్స్ కు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత కోలుకుంటున్న టాలీవుడ్ కు ఒకవిధంగా చెప్పాలంటే ఇది బిగ్ షాక్. చాలాకాలంగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న బడా సినిమాలకు టికెట్ల రేటుతో ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :