
ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో ఆకస్మాత్తుగా చనిపోవడం సినిమా ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. చిరంజీవి సర్జా సోదరుడు.. హీరో ధ్రువ సర్జా కరోనా బారిన పడ్డారు. అతడి భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
“నేను, నాభార్య కరోనా పాజిటివ్ గా నిర్దారించబడ్డాం. స్పల్ప లక్షణాలు ఉండటంతో..ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాం. త్వరలోనే కోలుకొని తిరిగి ఇంటికి క్షేమంగా వస్తామని ఆశిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ధ్రువ సర్జా పేర్కొన్నాడు.
కాగా ఇటీవలే సినీ పరిశ్రమలో పలువులు సెలిబ్రిటీలకు కరోనా సోకింది. అమితాబ్ బచ్చన్ కుటుంబంలోనూ కోవిడ్-19 కలవరం సృష్టించింది. బిగ్ బితో పాటు ఆయన కుమారుడు, కోడలు, మనవరాలు కరోనా బారిన పడ్డారు.